పక్షులు;- -గద్వాల సోమన్న,9966414580
స్వేచ్చగ ఎగిరే పక్షులు
వాటికి ఉండవు కలతలు
తర తమ భేదం తెలియదు
స్వార్థం మాత్రం ఉండదు

చెట్ల కొమ్మపై ఉండును
హాయి హాయిగా ఎగురును
గుంపు గుంపుగా వెళ్లును
సంఘీభావం తెలుపును

వాటికి సాయం రెక్కలు
అందాలొలికే ఈకలు
పైపైకి ఎగురుతాయి
గమ్యాన్ని చేరుతాయి

పక్షులతో ఉపయోగము
ఎరుగువవి అపకారము
భూతదయ చూపాలండి!
మనిషితనం చాటాలండి!


కామెంట్‌లు