స్వాగత గీతం- -గద్వాల సోమన్న,9966414580
ఆడే పాడే పిల్లల్లారా!
సొగసులు రువ్వే మల్లెల్లారా!
మీదే మీదే ముందున్న కాలం
రేపటి భారత పౌరుల్లారా!

అల్లరి చేసే బుడతల్లారా!
అందరి ప్రేమకు అర్హుల్లారా!
కథలు,పాటల ప్రేమికుల్లారా!
గృహమును యేలే రాజుల్లారా!

గగన సీమలో తారల్లారా!
వదన మేడలో నవ్వుల్లారా!
స్వేచ్చగ ఎగిరే పక్షుల్లారా!
సదన వనంలో పువ్వుల్లారా!

బడిలో ఉండే బాలల్లారా!
గుడిలో వెలిగే దివ్వెల్లారా!
రండీ! సంస్కారం నేర్చుకోండి!!
మడిలో ఎదిగే మొలకల్లారా!


కామెంట్‌లు