భగవద్గీతలో తృప్తి గురించి వివరించేటప్పుడు శ్రీకృష్ణుడు ‘‘మనం సృష్టించుకున్న ఆనందాన్ని అధిగమించాలి’’ అని మానవాళికి ప్రబోధించాడు. అట్లే సమస్త కర్మల పట్ల, వాటి ఫలితాల పట్లా సర్వదా ఆసక్తిని వదలుకొని, సంసార-ఆశ్రయ రహితుడై, నిత్యతృప్తుడైన మానవుడు కర్మల్లో చక్కగా నిమగ్నుడైనప్పటికీ అతను ఆ కర్మలకు కర్తకాదు అని కూడా చెప్పాడు. ఈ స్థితికి చేరినవారు అనుకూల, ప్రతికూల పరిస్థితులలో కూడా సంతృప్తిగా ఉంటారు మరియు ఎన్నడూ కూడా ఎటువంటి ద్వందాలకు లోను కారు. నిజజీవితంలో మనం చేసే ప్రతీ కార్యం చిత్తశుద్ధితో, ఆత్మ ప్రబోధానుసారం జరగాలి. మన మనసులో జనించే ఆలోచనలు హృదయం వరకు వచ్చేసరికి, మంచిచెడుల అంతర్మధనం జరు గుతుంది. చెడు వలదని ఆత్మ ప్రబోధిస్తున్నా, చెడు వైపే దృష్టి సారించడం దైవ ద్రోహమే. అంత రాత్మ అంగీకారమే దైవం మెచ్చిన సత్కారం. ఈ నిజాన్ని దాచి, అంత రాత్మకు విరుద్ధంగా ప్రవర్తించడం మానవ బలహనత. మానవుడు తన బలహనతలను జయించిన నాడు మహనీయుడు కాగలడు అన్నది శాస్త్ర వాక్యం.అశాశ్వత భోగాలను అనుభవించిన తర్వాత మనిషి తనకు నిజమైన ఆత్మతృప్తి, మానసిక శాంతి లభ్యం కాలేదు అని పరితపిస్తాడు. ప్రాపంచిక సుఖాన్ని కోరుకునే మనస్సు భోగలాలసతో, సుఖ సౌఖ్యాదుల కోసం మాత్రమే అర్రులు చూచుతుందనే సత్యాన్ని గ్రహిస్తాడు. క్షణికానందాన్నిచ్చే కోర్కెలు తీరిన తర్వాత ఏదో వెలితి, ఇదంతా భ్రమ అని బోధపడుతుంది. ఆ భ్రమ తొలగిన వెంటనే నిత్య తృప్తి, ఆత్మశాంతి అన్నది కోర్కెలు తీర్చుకోవడంలో కాదు, కోర్కెలను జయించడంలో వున్నది అన్న సత్యం అవగాహనకు వస్తుంది.
ఆత్మతృప్తి;- సి.హెచ్.ప్రతాప్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి