నీవల్లే- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 నా అఘమర్షణ పలవరింత 
నీ పేరే!
నా ఆకర్షణ పులకరింత
నీ బింబముకే!
నా దర్పణ పలకరింత
నీ రూపముకే!
నా శరీర జలదరింత
నీ స్పర్శనకే!
నా హృదయపు నిలువరింత
నీ రాకడకే!
నా ఆనందపు చిలుకరింత
నీ దర్శనకే!
నా మేని గిలిగింత
నీ ఊపిరికే!
నా చెమటల పొటమరింత
నీ చూపులకే!
అందుకే చెలీ!
నిన్ను చూడక నేనుండలేను
నిన్నొదిలి నేనుండలేను!!!
*********************************

కామెంట్‌లు