నక్కబావ నక్కబావ బాగున్నావా
నాల్గుదినములాయె నిన్ను జూడక బావ
కోతిబావ కోతిబావ బాగు న్నాను
అత్తగారి యింటికేగి వస్తున్నాను
మర్యాదలు జేసినార బావమరదులు
మంచిగనినుజూచినార
అత్తమామలు
రోజుకొక్క విందుతో పసందు జేసిరి
అందుకొరకె నాల్గు దినములాగి
పోతిని
అంతమంచిదేకానీ అక్కేదోయి
ఒక్కడవే వస్తుంటివి చిక్కే మోయి
తప్పతాగి కొడితినని రానంటుంది
తాగకుంట ఉంటేనే వస్తనన్నది
అక్కకంటె ఎక్కువనా మందు బావ
దిక్కుమాలిన మందు మాన లేవ
నీతోడు కోతిబావ మందు త్రాగనోయి
వస్తావ అక్కకడకు తోలు కొస్తామోయి
సరేసరే నక్కబావ పోదామోయి
అక్కనిపుడె తోలుకొని వద్దా మోయి!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి