పత్రికలు;- కోరాడ నరసింహా రావు !
కూచున్న చోటునుండే... 
 ప్రపంచ విషయ, విశేషాలను 
   విడమర్చి బోధించే.... 
   ఉపాధ్యాయుడే... పత్రిక !

పౌరుని, ఆలోచింపజేసి... 
  అడుగు ముందుకు వేయించే 
   చైతన్య శక్తి... పత్రిక... !

లొసుగులు - లాలూచీలను సైతం,  వెలికి తీసి... 
   వాస్తవికతను దర్శింపజేసే 
 దివ్య దర్పణం... పత్రిక.. !

పత్రిక లంటే...., 
   చైతన్య  వారధులు... 
    ప్రగతి రధ సారధులు.. !

నిజాన్ని, నిర్భయంగా... 
  చెప్పగలిగినవే... 
   నిజమైన పత్రికలు.. !

చెడును, నియంత్రించి... 
  మంచిని ప్రేరేపించాల్సిన పత్రికలు... 
   స్వలాభాపేక్ష కోసం... 
   అన్యాయానికి కొమ్ము కాస్తే, 
  అవి, పత్రికలు కావు... !
    సమాజానికి శత్రువులు !! 
 
పత్రికల ప్రాశస్త్యాన్ని.... 
.  నిలుపుటకై... అహర్నిశలూ 
    శ్రమిస్తున్న పత్రికలకూ... 
    విధి నిర్వహణలో నిజాయతీగా... ప్రాణాలను లెక్కచేయని... 
   జర్నలిస్టులు, పత్రికా విలేఖరులకూ.... 
  హార్దిక శుభాభి నందనలతో 
💐🙏🌷💐🙏🌷🙏💐🙏


కామెంట్‌లు