వలిచా- కేశరాజు వేంకట ప్రభాకర్ రావు-పాతర్లపాడు, ఖమ్మం.
 చిరు చిరుప్రాయము వేసిన బంధం
పెరిగెను తరువై తలపుల వనమున
సురుచిరు గానము వలపుల గంధం
తరుగక పూసెను తనియుచు మనమున !!

తావులు రేపిన మోహపు ఝరులు
రేవును గాంచక పగలు రేయి పరుగులు
పోవగ  బండల సైతం ముంచెను గుబులు 
బావురుమంటూ పిలిచా చెలిని !!

కొండలు కోనలు ఓహో యనినా
గుండెలొ గూడున నిలిచిన లలన
మొండిగ బదులే పలుకని వ్యధతో
మండలమంతా వినపడు రీతిగ అరిచా!!

ఉరుమై ఉరిమిన అరుపుకు బెదరక
చిరు నగవుల చెలి చెక్కిలి మెరవగ
పరువం పొంగీ ప్రేయసి చీరకు కొంగై ఎగిరా!
వరుడై పోయే తరుణం వచ్చెనని మైమరిచా!!

అది ప్రేమే కాదని జవరాలి నటనని
ముందే తెలియక మందే లేని గాయమదని
సందడి లేని సమరము చేయుచు
అందరిలో చులకనని అంతలోనే వ

కామెంట్‌లు