భాష చాలని భావమై
ఆశ చావని జీవమై
రాశిపోసిన నమ్మకమై
నిశిని గెలిచే ఉషగా....
రాగమెరుగని గానమై
గానమందలి మాటలై
మాట కందని భావమై
కంట వెలిగే మెరుపులా
కమనీయ కవన భావార్థమై
రమణీయ రమ్య దృశ్యమై
అనుసరణీయ గమనమై
అభిలషణీయ పయనంలా
ముసురుకొన్న దిగులును
ముప్పిరికొన్న గుబులును
ముంచివేసే కలతలను
మాయం చేసే మంత్రంలా
దూరంగా పొడిచే పొద్దును
దరిలోనే చూస్తూ ...
ఆనందనందనవనసీమలా
అంతరంగాన హాయి నిండగా
మధురముగా మారిన జగతి
మనోహరంగా మురిపిస్తుంటే
మనోజ్ఞసుందర సీమల దాపున
మదికోరిన మధుసీమను పొందే
సుధామయమైన ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి