అమ్మ నాన్నల తర్వాత గురువు కి పెద్ద పీట వేసింది మనభారతీయసంస్కృతి.క్రమంగా నలందా అమరావతి మొదలైనవి గొప్ప విద్యాకేంద్రాలుగా చైనా లాంటి దేశాలని ఆకర్షించాయి.కానీ గత 30ఏళ్ళుగా చదువు అనేది ఒత్తిడి వ్యాపారం గా మారింది.డబ్బుతో కొనే స్థితి దాపురించింది.మోరల్ సైన్స్ పుస్తకాలు చాలా ఖరీదైనవి కొన్ని బడుల్లో కొన్పించుతారు.పిల్లలు అందులో ప్రశ్న జవాబులు బట్టీ పట్టి చదివే దౌర్భాగ్యం దాపురించింది.పరీక్షలు పెట్టి మార్కులు గ్రేడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఇస్తారు.మహాభారతకాలంలో గొప్ప గురువు ద్రోణుడు.కౌరవపాండవులకి పాఠాలు అస్త్రశస్త్రాల విద్యలు నేర్పాడు.కానీ కొందరు ధర్మానికి సంఘానికి ఆతర్వాత చెడు చేస్తారు అని ఆయన అర్జునుడి కి తప్ప ఇంకెవరికీ యుద్ధ రహస్యాలు చెప్పలేదు.ఆఖరికి కన్నకొడుకు కి కూడా.పిల్లలందరికీ కరాటే నేర్పటం సబబు కానీ తుపాకీ నేర్పితే సర్వనాశనం.ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చూస్తున్నాం కదా? నేడు విద్యార్థులు టీచర్ చెప్పిన పాఠాలు వింటూ మంచి విషయాలు చదివితే అబ్దుల్ కలాం అంత గొప్పవారు ఔతారు.సకారాత్మక మంచి విషయాలు వినటం చదివించడం ఇంట్లో అమ్మ నాన్న లు చేయాలి.సెలవురోజు రెస్టారెంట్ సినిమా లకు కాదు వెళ్ళాల్సింది.గుడి మ్యూజియం లాంటివి చూపించాలి.పిల్లలచేత చిన్న చిన్న పనులు చేయించాలి.బడి హోం వర్క్ అని వారిని సతాయిస్తే టీచర్ అన్నా కోపం బడి అంటే విరక్తి వస్తుంది కదూ?
గురువు! అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి