నవంబర్ 9 నుంచీ చిగురుమళ్ళ శ్రీనివాస్100 దేశాలలో శాంతి సద్భావనా యాత్ర ----------------------- రెండేళ్ల పాటు సాగనున్న సాహిత్య, సాంస్కృతిక, సామాజిక చైతన్య ప్రపంచ యాత్ర --------------------- వంద దేశాలలోని వందకు పైగా తెలుగు సంఘాల సంయుక్త నిర్వహణలో జరుగుతున్న మహా అక్షర యజ్ఞం ------------------------ తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, వందేవిశ్వమాతరమ్ చైర్మన్ జయశేఖర్ తాళ్ళురి వెల్లడి ------------------------------
బోట్స్ వానా తెలుగు సంఘం అధ్యక్షులు తోటకూర వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో ఆఫ్రికా దేశాల యాత్ర
--------------------------------
కరపత్రం ఆవిష్కరణ -----------------------------------
ఉత్తర అమెరికా తెలుగు సంఘం TANA మరియు 100 దేశాల తెలుగు సంఘాల ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది.
నవంబర్ 9, 2023 వ తేదీన ఆఫ్రికా ఖండం లోని బోట్స్ వాన దేశంలో ఈ అపూర్వ యాత్ర ప్రారంభం అవుతుంది.
100 శతక పుస్తకాలు రచించిన
శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్
వందే విశ్వమాతరమ్" పేరుతో
100 దేశాలలో శాంతి, సద్భావనా యాత్ర కు శ్రీకారం చుట్టారు.
ప్రపంచ సాహిత్య చరిత్రలో అపూర్వమైన ఘట్టంగా చెప్పదగిన ఈ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక చైతన్య యాత్ర
తానా అధ్యక్షులు శ్రీ నిరంజన్ శృంగరపు, తానా పూర్వ అధ్యక్షులు, వందే విశ్వమాతరమ్ చైర్మన్ శ్రీ జయశేఖర్ తాళ్లూరి గారి ఆధ్వర్యంలో జరగడం అభినందనీయం.
బోట్స్ వానా తెలుగు సంఘం అధ్యక్షులు తోటకూర వెంకటేశ్వర రావు గారి నేతృత్వంలో ఆఫ్రికా ఖండ దేశాలలో యాత్ర జరుగుతోంది.
శిరీష తూనుగుంట్ల, డాక్టర్ ప్రసాద్ తోటకూర, వెంకట్ తరిగోపుల, శ్రీనాథ్ కుర్రా, అశోక్ కొల్లా మరియు వంద దేశాల తెలుగు సంఘాల అధ్యక్షులు, అనేక మంది పెద్దల నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
ఈ చారిత్రాత్మకమైన ఘట్టంలో వందకు పైగా సభలు జరగడం విశేషం.
ప్రపంచ వ్యాప్తంగా
తెలుగు వెలుగులు విరజిమ్ముతూ.. తెలుగు సాహిత్య పరిమళాలు వెదజల్లుతూ..
విశ్వశాంతి, విశ్వమానవ సౌభ్రాతృత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి రక్షణ, మానవీయ విలువలు వంటి బృహత్ లక్ష్యాలతో ఈ మహా యజ్ఞం జరుగుతోంది.
-----------------------------------
దీనికి సంబంధించిన పోస్టర్ను కోదాడ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ప్రదీప్, వందే విశ్వమాతరం జిల్లా సమన్వయకర్త, సాహిత్యవేత డాక్టర్ అరుణ కోదాటి,
కళా రత్న, పుడమి సాహితి వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చిలుముల బాల్ రెడ్డి, అడ్వకేట్ ఉయ్యాల నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి