తెల్లని
కాగితాన్ని
స్వచ్ఛతకి
నిదర్శనాన్ని
ఏమైనా
వ్రాయవచ్చు
ఎవరికైనా
పంపవచ్చు
క్షేమలేఖ
వ్రాయవచ్చు
ప్రేమలేఖ
రాయవచ్చు
అందముగా
చెక్కవచ్చు
పిచ్చిగా
గీయవచ్చు
ఏ ఊసయినా
పరవాలేదు
ఏ భాషయినా
ఇబ్బందిలేదు
ఏ మతమైనా
ఒప్పుకుంటా
ఏ కులమైనా
అంగీకరిస్తా
ఏ రంగైనా
సరేనంటా
ఏ విషయమైనా
సరేనంటా
పెన్నయినా
వినియోగించవచ్చు
పెన్సిలైనా
ఉపయోగించవచ్చు
బొమ్మయినా
గీయవచ్చు
ముద్రయిన
గుద్దవచ్చు
పువ్వుగా
మలచవచ్చు
పడవగా
మార్చవచ్చు
ఊహలను
తెలుపవచ్చు
మదులను
విప్పవచ్చు
కథను
రచించవచ్చు
కైతను
లిఖించవచ్చు
తెలివి
లేనిదాన్ని
చెప్పినవి
వినేదాన్ని
********************************
నిన్నరాత్రి
కలలోకి
వచ్చింది
తెల్లకాగితం
నిదుర
పోనివ్వక
లెమ్మంది
తెల్లకాగితం
కమ్మని
కవితని
కూర్చమంది
తెల్లకాగితం
కలాన్ని
పట్టమని
పదేపదేకోరింది
తెల్లకాగితం
దానికి
పర్యావసానం
ఈకవిత
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి