న్యాయాలు -319
సర్వశాఖా ప్రత్యయ న్యాయము
*****
సర్వ అనగా సమస్తము,అంతయు అని అర్థం. శాఖా అనగా కొమ్మ, పెద్ద లేదా చిన్న విభజన.ప్రత్యయః అనగా అధీనము,శపథము, జ్ఞానము, విశ్వాసము అనే అర్థాలు ఉన్నాయి.
"సర్వ శాఖా ప్రత్యయ మేకం కర్మ" అనగా అన్ని శాఖల వారు నమ్మేది ఒక కర్మయే" అని అర్థము.
నిశితంగా చూసినట్లయితే భిన్న భిన్న మతాలు ఉన్నా భక్తులు కొలిచే మార్గాలు వేరైనా వారంతా ఒకానొక నిరాకార రూపమైన దైవాన్నే. కాకపోతే ఒక్కో మతం వారు ఒక్కో పేరుతో రూపంతో కొలుస్తూ వుంటారు.
ఇలా హిందువులలో కొందరు సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి అగ్ని స్వరూపమైన దీపాన్ని వెలిగించి ఇష్ట దైవారాధన చేస్తారు.మరికొందరు సూర్యోదయం తర్వాత చేస్తారు.
ముస్లిములు సూర్యోదయ సమయం మొదలు రోజుకు ఐదు సార్లు నమాజుతో అల్లాను కొలుస్తారు.
క్రైస్తవులు ప్రతి రోజూ ఉదయము, మధ్యాహ్నము, సాయంకాల సమయాల్లో ప్రార్థన చేస్తారు.
అలాగే జైన మతస్తులు కూడా దైవారాధనలో మూడు కాలాల దేవతలకు నమస్కరిస్తారు.
ఇక బౌద్ధ మతస్తులు ప్రతి రోజూ ఉదయం ప్రార్థనతో దినచర్య ప్రారంభిస్తారు.
ఇలా ఒక్కో మతం ఒక్కో పద్ధతిలో ఇష్టమైన రీతిలో తమ తమ రోజూ వారీ దినచర్య ప్రారంభిస్తారు.ఇలా కేవలం మత సంబంధమైన వారే కాకుండా మానవీయ విలువలు కలిగిన వారంతా చేసే కర్మ లేదా పని ఏమిటంటే సమాజంలోని ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే.
అలా ఎవరు ఎలా ప్రార్థించినా వారు చేసేది సమస్త మానవాళికి మంచి జరగాలనే.సాటి వారితో సామరస్యంగా, దయతో మెలగాలనే.
అందుకే వేమన ఏమంటారంటే...
"పసుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటి/ పుష్పజాతి వేరు పూజ ఒకటి/ దర్శనంబు వేరు దైవంబు ఒక్కటె/ విశ్వదాభిరామ! వినురవేమ!"
మనుషులంతా ఒక్కటే.పశువులు వేరు వేరు రంగులలో ఉన్నప్పటికీ అవి ఇచ్చే పాలు మాత్రం తెల్లగానే వుంటాయి.అలాగే పూలు వేరు వేరు రంగులలో ఉన్నప్పటికీ పూజకు వినియోగ పడటంలో అన్నీ ఒక్కటే కదా!. మనుషులు వివిధ వర్ణాలు, వర్గాలు, జాతులు,మతాల వారి దర్శనాలు అంటే కొలిచే విధానం వేరైనా దైవం ఒక్కరే.
ఈ విధంగా శాఖలు వేరైనా చెట్టు ఒక్కటే. మతాలు వేరైనా కొలిచే దైవం ఒక్కరే. మనుషులంతా వేర్వేరైనా మానవీయ విలువలను కాపాడేందుకు చెసే పనుల సారం ఒక్కటే అని ఈ "సర్వశాఖా ప్రత్యయ న్యాయము" ద్వారా మనం తెలుసుకోగలిగాం.
ఎంతో గొప్పదైన మానవ జన్మను సార్థకం చేసుకోవాలనే అంతరార్థాన్ని గ్రహించి, కులమతాలకు అతీతంగా మానవీయ విలువలతో జీవిద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి