* అంతర్యామి *; - కోరాడ నరసింహా రావు.. !*
 @సృష్టిలోని అణువణువునా! 
           ******
 జన్మ - కర్మ..... కర్మ - జన్మల వలయంలో పాపపుణ్యాల ఫలం గా... సుఖ - దుఃఖాలనుభవించే భోక్త...  జీవుడు... !
 కేవల సాక్షీ భూత మై ..... 
   యే పాప - పుణ్యాల ప్రమేయమునూ అంటనిది ఆత్మ... !
ఎట్టి మమకార, వికారములు లేక... నిష్పక్షపాతముగా... 
   తీర్పులను తీర్మానించి అమలు జరుపు ఆ పరమాత్మ 
   అంతర్యామియై ఈ సృష్టి సమస్తములోనూనిండి, నిబిడీకృతమౌతున్న  చైతన్య శక్తి....!
నీవే... కర్తవై, కర్మ నుజరిపి.... 
  ఫలితము ననుభవించుసరికి 
    అది సుఖమైతే నీదే ఆ గొప్పయని..., 
   దుఃఖమైతే.... ఆ పరమాత్మను నిందించటం.... ఎంత విడ్డూరం.. !!
పంచ భూతములను, నవ గ్రహములను....సమస్త ప్రకృతిని సృజించి...., 
    యే ప్రాణికీ లేని విశిష్టతను కేవలం, నీకు మాత్రమే ప్రసాదించి ఆనందంగా అనుభవించమని దయతో ఆ తండ్రి నిన్ననుగ్రహిస్తే....., 
     అత్యాశతో.... అపరిమిత సుఖ, భోగ లోలుడవై.... 
  సమస్త ప్రకృతినీ వికృతంగా మార్చేసి... నీ స్వయంకృతానికి ఫలితాన్ని అనుభవించ వలసి వచ్చినపుడు... 
    ఆ పరమాత్మను నిందించటం..., అది నీ అతి తెలివా !?.. అజ్ఞానమా.. ?!
 తాత కు  దగ్గులు నేర్పుతావా ?!
   ఆంతర్యామి  ముందు .... అమాయకత్వాన్ని  నటించకు !!
    అతడు సర్వాంత  ర్యామి..!
 ఈ సృష్టి లోని అణువణువూ...
    పరమాణు సహితముగ  ను న్నాడు !
   ఆతని వద్ద... నీ అతి తెలివి పనిచేయదు  !!
      ********

కామెంట్‌లు