నిశ్శబ్దం
ఇరువురి మధ్యా
భయంకర నిశ్శబ్దం
గుండెలు పిండేస్తోంది
మంటలు మండిస్తోంది
నీకూ నాకూ మధ్య
అగాథం సృష్టిస్తోంది
కాని....
ఆలోచనలు
కలచివేస్తున్నాయి మనసును
ముంచివేస్తున్నాయి మత్తులో
అలాచూడకు!
భయపెట్టిస్తున్నాయి నీ కళ్ళు
అనుమాన రాక్షసి
వికటాట్టహాసం చేస్తోంది
దాన్ని....
నీవే తరిమెయ్యాలి
నిశ్శబ్దాన్ని చీలుస్తూ
నీ కంఠం
నా వీనుల విందై
నాలోని దైన్యాన్ని పోగొట్టాలి
చెలీ!
ఎందుకింత మౌనం?
తెలియదా నీకీ వైనం?!
*********************************
మౌనం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి