అలజడులు అణచివేసి
ఆత్రాలు ఆపుకుని
నిదుర కాచి నిట్టూర్చి
అంతరంగం వేచిన
అందమైన ఉదయం
శూన్యంలో దిగులును మోస్తూ
భారంగా కదిలే మనసులకు
దూరంగా మెరిసే ఆశాకిరణంలా
దిగివచ్చే ఉదయం
కదిలే కలతల మబ్బుల
మెదిలే కన్నీటి కథల
రెప్పదాటనీక కప్పివుంచిన
కనుల కాస్త ఆశను నిలిపే ఉదయం
చీకటి నిండిన బ్రతుకున
రేపటి కోరిక నిలిపే
మాపున ముసిరిన కష్టాల
మోపును దించే ఉదయం
నింగిని బంగరు రంగులు
పొంగిన నెనరుల వెలుగులు
చిందిన కాంతి పుంజాల
అందము చిందే ఆనందపు ఉదయం
కాలమెంత ఎదురైనా
కలిమి మొత్తం చేజారినా
చెలిమితో చేయిపట్టుకుని
నడిపించే కమ్మని ఉదయానికి
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి