తలవరం కాంప్లెక్స్ సాంఘికశాస్త్ర ఫోరం కార్యవర్గం ఎన్నిక

 సాంఘికశాస్త్ర సమున్నతికి, విద్యార్థులకు గుణాత్మక విద్యాసాధనకు
ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్రోపాధ్యాయుల ఫోరం ఏర్పడింది. 
ఎ పి ఎస్ ఎస్ టి ఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 
తలవరం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో గల వీరఘట్టం, పాలకొండ మండలాలకు చెందిన సాంఘిక శాస్త్రోపాధ్యాయులంతా సమావేశమై, ఈ ఫోరంను నేడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 
రాష్ట్రస్థాయిలో ఉన్న ఈ సంఘానికి
స్కూల్ కాంప్లెక్స్ ల వారీగా అనుబంధసంస్థలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో, తలవరం స్కూల్ కాంప్లెక్స్ శాఖ నేడు ఎంపికైనది. 
ఎ.పి.ఎస్.ఎస్.టి.ఎఫ్. తలవరం పాఠశాల సముదాయం ఫోరం అధ్యక్షులుగా 
మాచర్ల రఘునాథదొర, 
ప్రధాన కార్యదర్శిగా రౌతు గౌరీశంకరరావు, 
గౌరవాధ్యక్షులుగా గొడబ విజయభాస్కర్, 
మహిళా ప్రతినిధిగా పెయ్యల హేమలత, 
నిర్వాహక కార్యదర్శిగా ఎం.స్వర్ణలత, 
అసోసియేట్ అధ్యక్షులుగా పోతురాజు శంకరరావు, ఉపాధ్యక్షులుగా బౌరోతు మల్లేశ్వరరావు, ఎస్.నానిబాబు, సహకార్యదర్శిగా కుదమ తిరుమలరావు, 
కోశాధికారిగా వూలక రవి లు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
కామెంట్‌లు