మనం తిరుపతి యాదాద్రికి వెల్తాం. అలాగే మహారాష్ట్ర ప్రాంతం లో వారు పండరీపురం దర్శిస్తారు.అక్కడి దేవుడు పాండురంగడు.విఠోబా అని కూడా పిలుస్తారు.దామాజీ గొప్ప విఠోబా భక్తుడు.మంగళపట్టు గ్రామాధికారి గా నీతిన్యాయం ధర్మం భక్తితో ప్రజలప్రేమ విశ్వాసం పొందాడు.ఒకసారి కరువుకాటకాలతో అన్ని గ్రామాలు అల్లాడుతున్న సమయంలో తన ఇంట్లో ఉన్న ధాన్యం అంతా అందరికీ పంచాడు
రాజుకి ఇవ్వాల్సిన ధాన్యాగారం లోవి కూడా ఉచితంగా పంచాడు. ఈవిషయం తెల్సిన రాజు దామాజీని బంధించి తనదగ్గరకు తెమ్మని భటుల్ని పంపాడు.చేతికి బేడీలు వేసి తీసుకుని వెళ్తున్న భటుల్తోదామాజీ అన్నాడు" ఒక్క సారి పాండురంగ గుడిలో కెళ్ళి వస్తాను." గుడిలో దైవాన్ని ప్రార్థించాడు "తండ్రీ! ఆకల్తో అలమటించే జనాలకి అన్నంపెట్టే బాధ్యత రాజుది గ్రామాధికారి గా నాది.కానీ నాకు ఈశిక్ష విధించావా?" అని బాధపడ్తాడు.భగవంతుడు దయామయుడు. పాండురంగడు ఓమొరటువ్యక్తి వేషంలో కంబళీలోవరహాలు మూటగట్టి రాజుదగ్గరకు వచ్చి "ప్రభూ!దామాజీ ప్రభుత్వం కి చెందిన ధాన్యం ని అమ్మి ఆవరహాలను నాచేతికి చ్చి పంపారు" అనగానే రాజు ఆశ్చర్యపోతాడు.ఆవ్యక్తి వెళ్లి పోయాక భటులు సంకెళ్లు వేసిన దామాజీని సభలోకి తెస్తారు."దామాజీ! నీవు పంపిన మనిషి వరహాలు తెచ్చి ఇచ్చాడు " అనగానే" ప్రభూ! నేను దారిలో దైవ దర్శనం చేసుకున్నానంతే! మీరెంత భాగ్యశాలి! స్వయం గా పండరీపురం వచ్చాడు మీదగ్గరికి" అనగానే రాజు దామాజీపాదాలపై బడి క్షమాపణ కోరాడు.నిజమైన భక్తికి దేవుడు కరిగి పోతాడు.అందుకే సదా దైవనామస్మరణ చేస్తూ మనపని మనం చేసుకుంటూపోవాలి🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి