రాష్ట్ర ప్రభుత్వ నిర్దేశాలమేరకు రెండు రోజుల పాటు నిర్వహించిన
జిల్లా అంతర పాఠశాలల క్రీడా పోటీలు (గ్రిగ్స్) ముగిసాయని కొత్తూరు మండల స్పోర్ట్ ఆర్గనైజర్ జన్ని చిన్నయ్య తెలిపారు.
కురిగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన ఈ మండల స్థాయి పోటీల్లో విజేతల వివరాలను ఆయన వెల్లడించారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యా శాఖాధికారి ఎన్.శ్రీనివాసరావు విజేతలైన బాలబాలికలను అభినందించారు.
జూనియర్ కబడ్డీ బాలికల విభాగంలో విన్నర్స్ రన్నర్స్ గా కడుము, కురిగాం పాఠశాలలు,
సీనియర్స్ విభాగంలో కొత్తూరు, మెట్టూరు పాఠశాలలు నిలిచాయి.
జూనియర్స్ ఖోఖో బాలికల విభాగంలో కొత్తూరు, కడుము పాఠశాలలు విన్నర్స్, రన్నర్స్ గాను,
సీనియర్స్ విభాగంలో మెట్టూరు, నివగాం పాఠశాలలు సాధించాయి.
జూనియర్స్ కబడ్డీ బాలుర విభాగంలో మాతల, నివగాం పాఠశాలలు విన్నర్స్, రన్నర్స్ గా
గెలుపొందగా, సీనియర్స్ బాలురవిభాగంలో కొత్తూరు, నివగాం పాఠశాలలు గెలుపొందాయి.
జూనియర్స్ ఖోఖో బాలుర విభాగంలో విన్నర్స్ రన్నర్స్ గా కొత్తూరు, లబ్బ పాఠశాలలు ఎంపికకాగా, సీనియర్స్ ఖోఖో బాలుర విభాగంలో లబ్బ, కొత్తూరు
పాఠశాలలు ఎంపికైనాయి.
జూనియర్స్ వాలీబాల్ బాలికల విభాగంలో విన్నర్స్, రన్నర్స్ గా కడుము, కురిగాం పాఠశాలలు నిలవగా, సీనియర్స్ వాలీబాల్ బాలికల విభాగంలో విన్నర్స్, రన్నర్స్ గా కుంటిభద్ర, లబ్బ పాఠశాలలు నిలిచాయి.
కురిగాం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను ఎం.ఎస్.ఓ. జన్ని చిన్నయ్యతో పాటు
సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు రాజారావు, భాస్కరరావు, రామకృష్ణ, కృష్ణవేణి, శ్రీనివాసరావు, రమేష్, అనితా రెడ్డి, రేవతి తదితరులు నిర్వాహకులు, పర్యవేక్షకులుగా వ్యవహరించారు. ఎంపికైన జట్లు నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనవలసియుందని తెలిపారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి