ఓటు కోసం నోటు
తీసుకోవడం పొరపాటు
నోటుకు మీ ఓటు
కాకూడదు సమాజానికి చేటు
పాలకుల చేతుల్లో పావులు
కాకూడదు ఓటర్లు
స్వచ్ఛందంగా మీరు వేసే ఓటు
సరైన నేతకు తోడ్పాటు
సమాజ సేవకు అంకితమయ్యే నేత
ఎన్నుకోబడాలి మీ చేత
ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేది దేశ పౌరులే
ఓటు హక్కును సరైన నాయకున్ని ఎన్నుకోవడంలో వినియోగించుకోండి
స్వార్థపరులకు పట్టం కట్టకండి
ముందు తరాలను ముంచకండి
నవ చైతన్య మై అడుగేయండి
సమాజాభివృద్ధికి బాటలు వేయండి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి