తత్వవేత్త దేశభక్తుడు సంఘసంస్కర్త! ‌అచ్యుతుని రాజ్యశ్రీ
 ఆయన పై దాడులు విషప్రయోగాలు జరిగాయి.కొన్నిసార్లు బైటపడినా ఆఖరుకి పాలలో గాజుపొడి కల్పి ఇచ్చిన వంటవాడిని క్షమించాడు.అది 20సెప్టెంబర్! కడుపులో విషం ప్రవేశించింది.వాంతులైనాయి.కొన్నాళ్ళు నరకయాతన అనుభవించారు.ఆవంటవాడు పశ్చాత్తాపంతో వలవల ఏడుస్తూ ఉంటే " ఇది నాప్రారబ్ధం.నీతప్పులేదు.జోధ్పూర్ రాజు చెప్పాడు నీవు చేశావు." అని 200రూపాయలు వంటవాడి చేతిలో పెట్టినేపాల్ కి పంపిన ఉదారుడు.!
అన్ని మతాల దోషాలు ఎత్తిచూపిన ఈయనపై ఖడ్గం విసిరాడు ఓదుష్టుడు.విషంనింపిన కిళ్ళీ తిన్పించారు.యోగక్రియతో వెంటనే వాంతి చేసుకుని బ్రతికి బట్టకట్టిన మనీషి! నిర్భయత్వం ఆయన సొత్తు.విద్యావ్యాప్తి స్త్రీ సమానత్వం కోసం గురుకులాలు నెలకొల్పారు.
బలిష్ఠంగా శరీరసౌష్ఠవం ఉన్న ఈసన్యాసి ఆంబోతుల కుమ్ములాటను వాటి కొమ్ములు ఒడిసిపట్టుకుని చెరోవైపు తోసేసి జనాల్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు.
బ్రిటిష్ ప్రభుత్వం కి సింహస్వప్నం గా మారిన ఆయన భారతీయ సనాతనధర్మం సంస్కృతి నిగూర్చి ప్రచారం చేశారు.గుజరాత్ లో పుట్టిన ఈయన హిందీకి జాతీయ భాష స్థానం కల్పించాలని కోరారు.ఆయన ఉపన్యాసాలు ఆంగ్లేయులను ఉర్రూతలూగించాయి.ఇంగ్లాండ్ లో ప్రచారం చేయమని ఒక ఆంగ్లేయుడు అంటే "నాదేశ కాంతి అంతటా ప్రసరిస్తుంది" అన్నారు.
సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో ఆనాటి తాసిల్దార్ ఇంటి పుట్టిన ఈయనకి 8వ ఏటనే ఒడుగు ఐంది.కలరాతో చెల్లెలు బాబాయి చనిపోటంతో వైరాగ్యం అబ్బిన ఆయువకుడు 21వ ఏట పెళ్లి ఏర్పాటు చేస్తున్న అమ్మ నాన్నలకు చెప్పకుండా ఇల్లు వదిలి 14నవంబర్ 1860 లో మధురలో స్వామి విరజానంద శిష్యునిగా చేరారు.ఆయన అంధుడు కానీ 15సంవత్సరాలుగా తాను వెతుకుతున్న గురువు విరజానంద అని ఆయన పాదాలపై పడిన ఆయువకుడు
భారతజాతి రత్నం.గురువు కోపంతో కర్రతో కొడితే " కుమ్మరి మట్టిని కాలితో తొక్కి కుండను చేస్తాడు.నన్ను తీర్చిదిద్దే గురువు" అని ఆదెబ్బల మచ్చలను అందరికీ చూపేవారు.
ఇలాంటి మహాత్ముల జీవితాలు  చదివితే మనం ఏంటో మనకే తెలుస్తుంది 🌷
ఆయన మూలశంకరుడు.దయారాం అని ముద్దుగా పిలుచుకునే వారు.అమ్మ అమృత బాయి.నాన్నకర్షన్ జీ  లాల్ జీ తివారీ.గుజరాత్ లోని టంకారా ప్రాంత తాసిల్దార్. 
ఆర్యసమాజం స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి 🌷🌷🌹
కామెంట్‌లు