మిర్చి బజ్జీలు- ఎం.వి. ఉమాదేవి

పచ్చిమిర్చితో బజ్జీలు
రుచులకివే సమఉజ్జీలు!
పళ్లెం నిండా కొలువైనాయి
నోరూరించే మిర్చీలు!

అల్లం పచ్చడితో తింటాము
అదిరింది రుచి అనుకుంటాము
జామ్ సాస్ లూ రుచిచూస్తాము
జయహో బజ్జీలు అంటాము!!

చలిచలిగా ఉంటే బజ్జీలు
తొలిమలి సంజెల దోస్తీలు
వీధిలో బండి వస్తుండండి
ఉపాధినిచ్చే మార్గాలు!

సెనగపిండితో వాముజోడీ
అల్లరి పిల్లలకి కిరణ్ బేడీ
వర్షం వస్తే డిమాండ్ లేండి
వేడివేడిగా తినేయండి!
కామెంట్‌లు