దేశాభ్యుదయానికై అనునిత్యం పాటుపడిన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జీవితం, మనందరికీ ఆదర్శప్రాయమైనదని వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి అన్నారు.
నెహ్రూ జయంతిని పురస్కరించుకుని పాఠశాలలో నిర్వహించిన బాలలదినోత్సవ కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ బాలలంటే ఎంతగానో ఇష్టపడే చాచానెహ్రూ పుట్టినరోజును ఆయన మరణానంతరం, భారత ప్రభుత్వం బాలల దినోత్సవంగా పరిగణించడం జరుగుతోందని అన్నారు. ఉపాధ్యాయని దానేటి పుష్పలత మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా సహాయనిరాకరణ ఉద్యమాన పాల్గొనిన నెహ్రూ జైలుకి కూడా వెళ్ళారని, దేశం కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేసారని గుర్తుచేసారు.
ఉపాధ్యాయులు గోగుల సూర్యనారాయణ మాట్లాడుతూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నెహ్రూ సుదీర్ఘంగా పదిహేడేళ్లపాటు దేశాభ్యున్నతికి మిక్కిలి కృషిచేసారని అన్నారు.
ఉపాధ్యాయని పాలవలస శారదాకుమారి మాట్లాడుతూ స్టీల్ పరిశ్రమలు, ఐ.ఐ.టి.లు వంటివి నెలకొల్పి శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ అపారమైన కృషి చేసిన నెహ్రూ సేవలు ఎందరికో మార్గదర్శకంగా నిలిచాయని అన్నారు. ఉపాధ్యాయులు సిద్ధాబత్తుల వెంకటరమణ మాట్లాడుతూ జైల్లో ఉన్న సమయంలో కూడా తన కుమార్తె ఇందిరాగాంధీకి వ్రాసిన ఉత్తరాలలో భారతజాతి ఔన్నత్యాన్ని వివరిస్తూ దేశభక్తితో కూడిన
సందేశాలను పంపారని అన్నారు.
ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు మాట్లాడుతూ పంచశీల ప్రణాళికకు సూత్రధారిగాను, డిస్కవరీ ఆఫ్ ఇండియా వంటి గ్రంథాల రచయితగాను, జలాశయాల ప్రోజెక్ట్ ల నిర్మాణానికి వ్యూహకర్తగాను నెహ్రూ ఆశయాలు, యావత్ ప్రపంచానికి ఆదర్శమైనాయని అన్నారు.
తొలుత పండిట్ నెహ్రూ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి, ఉపాధ్యాయ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నెహ్రూ జీవిత చరిత్ర, బాలల దినోత్సవం ప్రాధాన్యతలను గూర్చి
పాఠశాల విద్యార్ధిణులు డి.శ్రావ్య, ఎస్.ఎస్.వర్ష, ఎం.భాస్విక, ఎ.హేమలతలు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో పండిత నెహ్రూ పుట్టినరోజు బాలలందరికి పుట్టినరోజు అనే పాటకు దూసి శ్రావ్య, సాహుకారి సాయివర్ష, ముంజి భాస్విక, అలజంగి సింధుప్రియ, డొంపాక కల్పన, కోట దీపిక, పెదగాడ మేఘన, అలజంగి హేమలత, కనపాక కైవల్యలు ప్రదర్శించిన నృత్యరూపకం అందరి ప్రశంసలు పొందింది.
అనంతరం పిల్లల్లారా పాపల్లారా రేపటి భారత పౌరులంతా అనే పాటను ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు ఆలపించారు.
ఉపాధ్యాయులు
విద్యార్ధులందరికీ మిఠాయిలు పంచిపెట్టీ శుభాకాంక్షలు తెలిపారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి