ఆత్మ విశ్వాసం- సి.హెచ్.ప్రతాప్

 ఆత్మవిశ్వాసం అనేది తనపై లేదా తనపై తనకున్న విశ్వాసం.ఇది మానవ జీవితంలో వారి అభ్యుదయంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం వల్ల సవాళ్లను ఎదుర్కొనేందుకు అడ్డంకులు ఎదుర్కునే శక్తిని మరియు దృఢ సంకల్పంతో మీ లక్ష్యాలను గ్రహించగలుగుతారు. మీరు మీపై నమ్మకం ఉంచినప్పుడు, మీరు లెక్కించబడిన నష్టాలను తీసుకునే అవకాశం ఉంది, మీ కోసం మాట్లాడండి మరియు మీ విలువలు మరియు ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.ఆత్మ విశ్వాసం అంటే తనపై తనకు సంపూర్ణ విశ్వాసం. ఎవరికైతే ఆత్మ విశ్వాసం మెండుగా ఉంటుందో? వారికే విజయాలు ఎక్కువగా దక్కుతాయి. తన మీద తనకు ప్రగాఢమైన నమ్మకం ఉండాలి. నేను తలపెట్టిన పనిని నిస్సందేహంగా పూర్తి చేస్తాననే సంకల్పం ఉండాలి.
నేను చేయగలను" అని అనుకునేదే ఆత్మవిశ్వాసం, "నేనే చేయగలను" అనేది మాత్రం అహంకారం అవుతుంది. ఈ రెండిటికి వ్యత్యాసం మనం తెలుసుకొని ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరైనా ఏదైనా చెయ్యగలరు అని ఎన్నో సంఘటనలు నిరూపించాయి. మనకి ప్రతిభ ఉండి ఆత్మవిశ్వాసం లేకపొతే ఏ రంగంలోనైనా కూడా సరిగ్గా మనం రాణించలేము. ఆత్మవిశ్వాసం అనేది మనిషికి ఒక శక్తిమంతమైన ఔషదంలా పని చేస్తుంది. మనం అనుకున్న పనిని, అనుకున్నట్టు సాధించడానికి ఆత్మవిశ్వాసం చాలా తోడ్పడుతుంది.ముందుగా ఏదైనా ఆపద వస్తే సహనాన్ని కోల్పోరాదు.అధైర్యపడకుండా,ఆత్మవిశ్వాసం తగ్గకుండా,ఆలోచించి ముందుకు నడవాలి. కష్టాలు మనుషులకు రాకపోతే మానులకు వస్తాయా, అన్నింటిన్నీ అధిగమిస్తేనే మనం అవతలి వారికి ఆదర్శప్రాయులవుతాం.ఆత్మవిశ్వాసం సరిపడినంత లేని వారు సరిగ్గా కమ్యూనికేట్ చెయ్యలేరు. అభిప్రాయం సూటికగా చెప్పడానికి కూడా సంకోచిస్తారు. పనులు చక్కబెట్టడంలో తడబడుతారు. వీరికి అటు వర్క్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ రెండింటి మధ్య సమన్వయంలో కూడా సమస్యలు రావచ్చు. జీవితంలోని ప్రతి అడుగులో మనం ముందుండాలంటే తప్పనిసరిగా మన మీద మనకు విశ్వాసం ఉండడం చాలా ముఖ్యం.అలా కాదు అని.. ప్రతి చిన్న విషయానికి అనవసర ఆలోచనలు చేసి ఆత్మ విశ్వాసం కోల్పోతే ఎప్పుడు గెలవలేరు. అందుకే ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసంతో ఉండాలి.. అప్పుడే మనం అనుకున్నది ఏదైనా.. ఎన్ని కష్టాలు వచ్చిన వాటిని ఎదిరించి మనం నిలబడగలం. ఆత్మవిశ్వాసం అంత ధృడమైనది.. ఆత్మవిశ్వాసంతో ఉంటే విజయం మీ కాళ్ళ ముందు ఉంటుంది. 
కామెంట్‌లు