తెలంగాణలో పట్టిష్టమైన నాణ్యమైన విద్యను అందించాలి ; -వెంకట్ :మొలక ప్రత్యేకప్రతినిది
 తెలంగాణలో పట్టిష్టమైన నాణ్యమైన విద్యను అందించాలంటూ సీఎంకు లేఖ రాసిన మామిడిపూడి (MVF) వెంకటరంగయ్య ఫౌండేషన్
జాతీయ కన్వీనర్ :వెంకట్ రెడ్డి 
గౌరవ శ్రీ . కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు
అధ్యక్షులు, భారత్ రాష్ట్ర సమితి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి
హైదారాబాద్.తెలంగాణ రాష్ట్రం.
 
ఆర్యా!
విషయము: తెలంగాణలో విద్యా వ్యవస్థను పటిష్టపరచి నాణ్యమైన విద్యను అందించే గ్యారంటీ ప్రభుత్వం
              చట్టబద్ద బాధ్యతగా తీసుకోవాలి.
​……………………………………………………………………….
 
పాఠశాల విద్యా వ్యవస్థలో UDISE ఆధారంగా రాష్ట్రాలు మరియు జిల్లాల వారీగా పనితీరును లెక్కిస్తూ కేంద్ర ప్రభుత్వం “పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్” (PGI 2.0 2021-2022) ను విడుదల చేసింది.
 
ఈ నివేదికలో అభ్యసన ఫలితాలు, మౌలిక వసతులు, సమానత్వం, పాలనాప్రక్రియ, విద్యార్థుల నమోదు మరియు ఉపాధ్యాయులకు విద్యాశిక్షణ అనే ఆరు అంశాల ప్రాతిపదికన మార్కులు కేటాయించింది. ఈ మార్కుల ఆధారంగా రాష్ట్రాలకు వివిధ కేటగిరీల (గ్రేడ్ – లెవెల్స్)ను నిర్ధారించారు. ఈ నేపధ్యంలో తెలంగాణా రాష్ట్రం 1000 మార్కులకు కేవలం 479.9 పాయింట్లతో దేశంలోని 36 రాష్ట్రాలలో 31వ స్థానంలో నిలిచింది. అంటే కింది నుంచి ఆరో స్థానంలో నిలిచింది. తెలంగాణ కన్నా తక్కువ పాయింట్లు పొందిన 5 రాష్ట్రాలు, బీహార్ మరియు నాలుగు ఈశాన్య రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. ఇక అతి ముఖ్యమైన ‘అభ్యసన ఫలితాల’లో 240 పాయింట్లకు కేవలం 36.6 పాయింట్లతో దేశంలో 35వ స్థానంలో నిలిచింది, ఒక్క మేఘాలయ మాత్రమే తెలంగాణా కన్నా వెనుకబడి వుంది.
నవంబర్, 2021 లో దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ అచీవ్ మెంట్ సర్వే (NAS) ప్రకారం మన రాష్ట్రంలోని విద్యార్థుల తరగతి వారి విద్యా సామర్ధ్యాలు కింది విధంగా వున్నాయి.
      విషయం
తరగతి
తెలుగు
గణితం
పరిసరాల విజ్ఞానం
సామాన్య శాస్త్రం
సాంఘీక శాస్త్రం
ఇంగ్లీషు
3వ తరగతి
48%
44%
45%
 
 
 
5వ తరగతి
43%
35%
38%
 
 
 
8వ తరగతి
48%
32%
 
35%
34%
 
10వ తరగతి
36%
29%
 
34%
36%
48%
ఇక సామాజిక వర్గాల వారిగా విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు ఇంకా ఎక్కువ ఆందోళనకరంగా ఉన్నాయి. ఎస్.సి విద్యార్థులు 28 నుండి 48 శాతం, ఎస్టీ విద్యార్థులు 27 నుండి 46 శాతం, బీసీ విద్యార్థులు 29 నుండి 48 శాతం మాత్రమే విద్యా సామర్ధ్యాలు కలిగి ఉన్నారు.
 
ఇదే నివేదికలో ప్రైవేటు పాఠశాలల విద్యా సామర్ధ్యాలను పరిశీలించితే కొంచెం అటు ఇటు తప్ప పెద్దగా ఏమీ తేడా కనిపించడం లేదు. ప్రాథమిక స్థాయి విద్యార్ధులే కాకుండా ఉన్నత పాఠశాల విద్యార్ధులు కూడా పుస్తకం చూసి చదవలేని వారు కొందరైతే అసలు తెలుగులో రాయలేని పరిస్థితి మరి కొందరిది. గణితం విషయంలోనూ కూడికలు, గుణకారాలు, బాగాహారం చెయ్యలేకపోతున్నారు.
 
నాణ్యమైన విద్యను అందించక పోవడం మూలంగా ప్రజలు ఎదుర్కొనే అనేక సామాజిక వెనుకబాటుకు ప్రభుత్వాలు బాధ్యత వహించవలసి ఉంటుంది. ముఖ్యంగా తరతరాల వెనుకబాటుతనం కొనసాగుతుంది. తీవ్రమైన ఆర్ధిక సామాజిక అసమానతలు కొనసాగుతాయి. రాజ్యాంగ స్పూర్తి అయిన సామాజిక న్యాయం అందకుండ ఉన్న అసమానతలతో పాటు నూతన అసమానతలు పెరుగుతాయి. నైపుణ్యత లేని అసంఘటిత కార్మికులుగా, తక్కువ వేతనాలతో పేదరికం విషవలయంలోకి నెట్టబడతారు. తెలంగాణలో విద్యావ్యవస్థ పెద్ద సంక్షోభంలో ఉంది. నాణ్యమైన విద్య అందించకపోవడం అంటే రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలి. నాణ్యమైన విద్యను అందించే గ్యారంటీ ప్రభుత్వం చట్టబద్ద బాధ్యతగా తీసుకోవాలి.
 
ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థలలో చదువుచున్న విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగు పరచడానికి ప్రభుత్వం యుద్ద ప్రాతిపదిక మీద విద్యా ప్రమాణాలను మూల్యాంకనం చేసి తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి.
 
ప్రతులు జతపరచనైనది
1. తెలంగాణ పాఠశాల విద్య- సవాళ్లు, సూచనలు (నోట్)
2. జిల్లాల వారీగా విద్యా ప్రమాణాలు
3. తెలంగాణలో విద్యా సామర్ధ్యాల సామాజిక పరిశీలన
 
ఇట్లు
మీ
 
ఆర్. వెంకట్ రెడ్డి
జాతీయ కన్వీనర్, ఎం.వి.ఫౌండేషన్
కామెంట్‌లు