న్యాయాలు -316
సముద్ర మథన న్యాయము
******
సముద్రము అంటే సాగరము జలనిధి పయోనిధి ఉదధి జలధి సంద్రము అనే అర్థాలు ఉన్నాయి.మథనం అంటే చిలుకుట,త్రచ్చుట, కల్లోలము చేయబడుట.
సముద్ర మథన సమయంలో అమృతాధి ఫల భోక్తలు దేవతలు. కానీ సంక్షోభం పొందినది మాత్రం సముద్రుడు.అంటే లోక కళ్యాణం కోసం సత్పురుషులు ఎలాంటి కష్టాలనైనా ఓర్చుకుంటారు అని అర్థం.
సముద్ర మథనం గురించి రేఖా మాత్రంగా తెలుసుకుందామా...
సముద్ర మథన ఘట్టం గురించి రామాయణ ,మహా భారతాలు ,భాగవత, విష్ణు పురాణాలలో చెప్పబడింది.
రాక్షసులు దేవతలను అనేక రకాలుగా బాధ పెడుతూ వుంటే వారంతా శివుడిని,బ్రహ్మను వెంట బెట్టుకుని శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి వాళ్ళ బాధలను చెప్పుకుంటారు.క్షీర సాగర మథనం చేస్తే అమృతం పుడుతుంది.దానిని సేవిస్తే మీ బాధలన్నీ తొలగి పోతాయని విష్ణువు చెబుతాడు.
అది చిలకాలంటే రాక్షసుల సాయం అవసరం,వారితో సఖ్యంగా ఉండి ఈ పని సాధించండని విష్ణువు అనడంతో ఇంద్రుడు రాక్షసులకు అమృతం విషయం చెప్పి వారిని సాగర మథనానికి సమాయత్తం చేస్తాడు.
ఆ విధంగా దేవదానవులు కలిసి మందరగిరి పర్వతాన్ని కవ్వంగా , వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసి సముద్రాన్ని చిలుకుతూ వుంటారు.
అలా మథించడం వల్ల మొదట హాలాహలం అంటే విషం పుడుతుంది.దానిని శివుడు సముద్రంలో కలవకుండా మింగి గొంతులో ఉంచుతాడు. ఆ తర్వాత కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం, అప్సరసలు, చంద్రుడు ఉచ్చైశ్రవం( ఏడు తలల దేవతాశ్వము)మహాలక్ష్మి , పారిజాత వృక్షము, కౌస్తుభము,ధన్వంతరి,సురాభాండము,అమృతం మొదలైనవన్నీ పుట్టాయట.వీటి వల్ల దేవతలు మంచి ఫలితాలను పొందారు.
వీటన్నింటి వల్ల తనకంటూ ఎలాంటి లాభం లేకపోయినా దేవదానవుల కోసం మథించేటప్పుడు కలిగే బాధను సముద్రుడు ఎంతో ఓర్పుతో భరిస్తాడు.
అంటే లోక కళ్యాణం కోసం మంచి వారు సముద్రుడిలా ఎలాంటి బాధలు,యిబ్బందులనైనా ఓర్చుకోవడానికి సిద్ధపడతారు అనే విషయాన్ని ఈ "సముద్ర మథన న్యాయము" ద్వారా మనం తెలుసుకోగలిగాం కదా!.
సముద్రము వలెనే పండ్ల చెట్టు కూడా. తనపై రాళ్ళ విసిరి పండ్లను రాల్చుకుంటూ వుంటే ఆ చెట్టు రాళ్ళ దెబ్బల బాధను ఓపిగ్గా భరిస్తుంది.
మంచి పనులు చేద్దాం. అలా చేసే వాటిల్లో మనమూ భాగస్వాములవుదాం. ఏవైనా యిబ్బందులు, బాధలు ఎదురైతే సముద్రుడి సహనాన్ని, చెట్టును గుర్తుకు తెచ్చుకుని, ఓర్పుతో వుందాం.కష్టమైన యిబ్బందులను యిష్టంగా భరిద్దాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి