ఆదిత్య హృదయం - కొప్పరపు తాయారు
 హరిదశ్వః సహస్రార్చి: సప్తసప్తిర్మ్మరీచిమన్
తిమిరోన్మథన: స్శంభు: స్త్వష్టా మార్తాండ 
అంశుమాన్                
హిరణ్యగర్భ స్సిశిర తపనో భాస్కరో రవి:
అగ్నిగర్భో దితే: పుత్రా: స్శంఖ స్శిశిరనాశనః
వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజు:స్సామపారగః
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీధీ ప్లవంగమః
ఆతపీ మండలీ మృత్యు: పింగళ:స్సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజా: రక్త స్సర్వభవోద్భవః
ఆకాశమునకు అధిపతియైనవాడు. రాహువును 
ఛేదించు లక్షణముగలవాడు. పూర్వాహ్ణమున 
ఋగ్వేదరూపము, మధ్యాహ్న సమయమున 
యజుర్వేదరూపమును, సాయంసమయమున 
సామవేదరూపమునను అలరారుచుండెడివాడు. 
ఘనముగా వర్షములను కురిపించుచుండువాడు. 
అందువలననే జలములను వర్షింపజేయువాడు అని 
ఖ్యాతి వహించెను. వింధ్యగిరి మార్గమున 
అతివేగముగా సంచరించువాడు.
              *****


కామెంట్‌లు