పుస్తకం - మంచి నేస్తం- డాక్టర్ అరుణకోదాటి - హైదరాబాద్
 గ్రంధాలయ  వారోత్సవాల  సందర్బంగా
************
ఇంట్లో నుండి  కదలకుండా  ప్రపంచాన్ని  చుట్టి రావొచ్చు
ఒక్క మనిషికి  ఎన్నో  అనుభవాలు,
కానీ పుస్తకంలో  ఎన్నో  పాత్రలుంటాయి
అన్నీ పాత్రాలకూ  ఎన్నో  అనుభవాలు,


బంధాలను, బాoధవ్యాలను, ఉద్వేగాలను 
జీవన పోరాటాలను ,
ఆపాత్రలో మమకమై చదువుతాము.
ఊహలకి రెక్కలు  తొడిగి నిన్నటి  చరిత్రలోకి,
రేపటి భవిష్యత్తు లోకి తొంగి చూస్తాము.


పురాణాలలో  రాముడు, కృష్ణుడు  ఎలా 
ఉoటారో   , వారి గుణగణాలు  ఎవరూ  చూడలేదు,
నీలమేఘశ్యాముడూ, ఆజానుభావుడు  అని 
గ్రంధాలలో  ఉన్న అక్షరాల్లోంచే కదా, మనం  తెలుసుకుంది?

పుస్తకం  ఆనందాన్నిస్తుంది, అలవాట్లను మారుస్తుంది, స్నేహితుడిలా  జీవితానికి  మార్గనిర్దేశం  చేస్తుంది,
కష్టాల్లో ఉన్నవేళ ఆప్తుడిలా ఓదార్చి దైర్యం  చెప్పుతుంది,
తరాల మధ్య వారధి చేస్తుంది
పుస్తకాపఠనాన్ని దినచర్యలో  భాగంగా  చేసుకోవాలని  ఏప్రిల్  23  న పుస్తకప్రపంచ దినోత్సవాన్ని  నిర్వహిస్తుంది యూనెస్కో.

చిన్నపిల్లలు  బొమ్మలా కార్షిస్తూ వచ్చే కధలు  ఉత్సాహంగా  చదువుతారు.
 ఒకప్పుడు  యుద్ధనపూడి, మాదిరెడ్డి  సులోచనలు,  కౌసల్య దేవి,  మొదలైన  రచయిత్రులు  రచించిన  కుటుంబ నవలలు  ఎంతో  మంది  గృహిణులు  చదివితే,
నేటికీ  కొన్ని  వరపత్రికలలో  వచ్చే  కుటుంబ  కధలకు  అక్షర్షితమై  ఆనందపడుతున్నారు.

మైకరోఫాస్ట్ కి  సారధి గా ఉన్న సత్య నాదేళ్ల " హిటరిఫ్రెష్ " అనే  పుస్తకం  రచించి
 వత్తిడిలో  ఉన్న  సాంకేతిక  యువతరం 
ఆ పుస్తకం  చదివి  ఎంతో  రిలాక్స్  అయ్యారని  అభినoదనల వెల్లువ  కురిపించారు, వారే కాదు  ఎంతో  మంది వయసులోనూ,  వృత్తి లోనూ  ఉన్న  పెద్ద వారుకూడా  ఆపుస్తకం  చదివి  ప్రశసించారు.

వ్యాపారంలో ను, దాతృత్వం లోను  ఎంతో పేరున్న విప్రో వ్యవస్థాపక   ఛైర్మెన్  "ఆజీమ్ ప్రేమ్ జీ  "  హిటర్ ఫ్రెషర్ "  తనకి వ్యాపార రంగంలో, పిల్లల పెంపకలో  తన  జీవితం మీద  ప్రభావం  చూపిందన్నాడు, ఫ్యూచర్ గ్రూవ్  c. O  తనకిష్టమైన  పుస్తకాల్లో  ఇది  ఒకటన్నారు. షి యోమి  ఇండియా వైస్ ప్రెసిడెంట్  మనుకు  మార్ జైన్  క్షణం  తీరిక లేని  ఉద్యోగం  అయినా రోజూ తన డైనందిన  జీవితంలో  చదువుకు  కొంత కాలాన్ని  కేటాయిస్తాడట.

పుస్తక పఠనం కేవలం  కాలక్షేపం  కొరకే  కాక  మెదడుకు  వ్యాయామం లా అయి  జ్ఞాపక శక్తిని  పెంచుతుంది.
పుస్తక పఠనం  వలన  ఆరోగ్యం  మెరుగై ఆయుస్సు  పెంచుతుందట 
అందుకే  ప్రతి ఒక్కరూ  రోజుకు  రెందు పేజీలు  అయినా  చదవాలి.
తమ తమ రంగాల్లో ఎంతో  కస్టపడి  పైకొచ్చిన వారంతా  పుస్తకపఠన  ప్రేమికులే 
బాగా చదివే వారు  గంటకు  150  పేజీలు చదువుతారట.
పుస్తక పఠనం  విజ్ఞానం  ఇవ్వడమే  కాదు,
కొత్త  కొత్త  వ్యక్తులను  కూడా  పరిచయం  చేస్తుంది.
ఒక మంచి పుస్తకం  జీవితానికి  దారి చూపుతుంది.





కామెంట్‌లు