సంఖ్య -920
===========
పాండిచ్చేరికి సమీపంలోను
గొప్ప పుణ్యక్షేత్రం తిరునల్లారు ను
ఇచ్చట శనీశ్వరుడు వెలసెను
ఇచ్చటున్నవి నవగ్రహములును
దర్బరణ్యేశ్వర స్వామియు ఉమా!
ఒకగోడ గూటిలో కొలువైయున్నాడు
బంగారుకాకిపై ఊరేగుతాడు
ఏల్నాటి శనిని తొల్గించుతాడు
ప్రభావంతగ్గించి కాపాడుతాడు
నలమహారాజు కొలనుంది ఉమా!
దమయంతి కథయందునను
నలునిపై శని ప్రభావములను
కొలనులోస్నానం పూజవలనను
బాధలనుండి విముక్తిపొందెను
ఇటువంటి దృశ్యాల చిత్రాలు ఉమా!
నల్లవస్త్రమూ నూనెదీపములు
నువ్వులనూనె అగరు వత్తులు
మిఠాయిలును పండ్లతో దండలు
జిల్లేడు ఆకులు కర్పూరములు
కొబ్బరికాయ ఆకువక్కలు ఉమా!
శనికి అర్పించిన దోషం తొలగును
తైలాభిషేకమూ చేయించవలెను
నలమహారాజుయే నిర్మించెను
ప్రసిద్ధి చెందిన ఆలయం గాను
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి