" ఆడపిల్లగా...... ! "- కోరాడ నరసింహా రావు !
పల్లవి :-
ఆడపిల్లగా పుట్టావనీ, నువ్ బాధపడకు చెల్లి....నువ్వ  బలవు కావమ్మా... !
 అనుగ్రహిస్తే... అమ్మవు నీవు... !!
  ఆగ్రహిస్తే... ఆదిశక్తివే నీవమ్మ ...!!!
. ఆదిశక్తివే నీవమ్మా.... !
       " ఆడపిల్లగా..... "
చరణం :-
ఆదియందు, నీదే అధికారము మహారాణి వే  నీవమ్మ... !
 మగాడు, పశు బలముతో ...  నిను, లొంగ దీసుకునీ ... 
  అధికారం రుచి మారిగాడు !
 నిన్నగద్రొక్కి ఉంచాడు !!

 నిన్ననగ ద్రొక్కి ఉంచాడు. 
      " ఆదియందు..... "
..   " ఆడపిల్లగా..... "
చరణం :-
     చదువు వలనె  సంస్కారము పెరుగును... 
  చక్కగ నువ్ చదవాలమ్మ ! 2
ఎందరెందరో, ఆడపిల్లలే..., 
 తమ, తమ సత్తాలను చాటారు ! మగవారి నదిగ మించారు !
  వారే, నీకు ఆదర్శం... !
భావితరాలకు కావాలి... 
  నీవే  గొప్ప ఆదర్శం... !.. 2
  ఆదర్శ మహిళవని నిన్ను... 
 ఈ ప్రపంచమే కొనియాడాలీ 
  ఈ ప్రపంచమే కొనియాడాలీ !
      *******
కామెంట్‌లు