సుప్రభాత కవిత - బృంద
అందమైన ప్రకృతి కి
ఆనందాలు బహుమతిగా
అనుగ్రహించి అలరించేది 
వేకువేగా!

ఉరకలేసే  అలలతో
ఉయ్యాలూగే జిలుగులతో
ఉదధి ఉత్సాహం పెంచేది 
వేకువేగా!

ఇలను వసించే జీవజాలానికి
ఇనుడిచ్చిన కానుకగా
ఇంకొక అవకాశం తెచ్చేది 
వేకువేగా!

విరిసే కుసుమాల తావిని
మురిసే రెక్కల మాటున దాచి
తడిసిన కొమ్మల  ఊపేది
వేకువేగా!

సూదిగుచ్చే కిరణాలతో
నులివెచ్చగ ధరణిని తాకే
తొలిసంధ్య పలకరింపు తెచ్చేది
వేకువేగా!

గమ్యమెరుగని గమనానికి
రమ్యమైన పయనంలో
దివ్యమైన వరమిచ్చేది
వేకువేగా!

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు