హృదయం- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 నా హృదయాకాశాన
నీ ఆలోచనలు
అల్లరి మేఘాల్లా
అలవోకగా కదలాడుతున్నాయి!
ఆ మేఘాల బంగారు అంచుల్లో
నా చెలి మోముకోసం
నా కళ్ళు వెదుకుతున్నాయి!
నీలి మేఘాల గగనం
నా హృదయంలా
కల్లోలంగా ఉంది
నిబిడాంధకార హృదయకుహరం 
నీ కంటి కరదీపిక కోసం 
పరితపిస్తోంది
నీ ప్రేమామృత బిందువుల కోసం 
నా హృదయం
ముత్యపు చిప్పలా ఎదురుచూస్తోంది
నీ ప్రేమానురాగాల ఉషోదయం కోసం
చెలీ!
ఈ చిక్కటి కాళరాత్రిని 
ఎంతకాలమైనా భరిస్తా!!
*********************************

కామెంట్‌లు