అక్షరాలు వాక్కుగా మారి శబ్ద రూపంలో ప్రయాణిస్తాయి
వాక్కును అక్షరంగా కొలిచారు
సరస్వతీగా ఆరాధించారు
భాషలు వేరైనా భావప్రకటనకు అక్షరమే మూలధారం,
తెలుగులో 56 అక్షరాల వర్ణమాల తరతరాలుగా భాషా సంపదను అందించింది.
పిల్లలకు ఓం తో ప్రారంభించి, శ్రీ కారాన్ని దిద్ది
నమశ్శివాయ అనే అక్షరాలుదిద్దించేఆచారం.
ఒకే అక్షరoగా సృష్టికి మూలమై ఉద్బవించిన
ప్రణవ నాధం ఓంకారం
ఏ కాక్షర బ్రహ్మ గా వేదం వర్ణించింది.
శూన్యంలో, సముద్ర హోరులో, గాలి, సవ్వడిలో, గుడిగంటలో
ఏకాక్షర శబ్దం ఓంకారంగా వినిపిస్తుంది.
ఇరవై నాలుగు అక్షరాలతో కూడిన గాయత్రి ఆగమ శాస్త్రం అంగీకరించిన వేదమంత్రం
వాల్మీకి మహర్షి రామాయణంలో గాయత్రి మoత్రం లోని ఒక్కొక్క అక్షరాన్ని వరుస క్రమంగా వేయి శ్లోకాలకు ఒకటిగా వేసి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రచించాడు
ఆదికావ్యంగా, మొక్షాన్ని, సామాజిక ధర్మాలను ప్రసాదించే తరాలుగా నిలిచే
శక్తిని రామాయణం ఇదే కారణం అని భావన!
విత్తనంలో శాకోప శాఖలుగా విస్తరించే మహావృక్షం దాగినట్టు అక్షరంతో
మహోన్నతమైన అర్దాలు దాగివున్నాయి.
అక్షరం మనిషిని వివేకవంతం, సంస్కార వంతం కావిస్తుంది.
శతకాలుగా దర్శన మిచ్చిన అక్షర సంపద తర తరాలుగా మనిషికి వివేక జ్ఞానాన్ని ప్రసాదించింది.
వేమన శతకం, దాశరధీ శతకం, కాలహస్తీ శ్వర శతకం లాంటి అనేక శతక కావ్యాలు
మానవులకు మంచిమార్గాన్ని చూపాయి.
పద్యంలోని కవితాత్మక అక్షర రూపాలు గుండెల్లో మధురనుభూతిని, రసానుభూతిని
అందించాయి.
పద్యం ఒక బంగారు పళ్లెం దానిలో వర్ణన, చందస్సు, సొగసు, కధాగమానం, అతిశయం
ఆర్డ్రత వడ్డీంచిన మధుర పదార్దాలు.
మధుర పదార్దాలను అనుభవించి ఆస్వా దించి బంగారు పళ్లాన్ని భద్రపరుచుకోవాలి.
గ్రాంధికమైనా, వ్యాహారిక మైనా, అక్షరం ఆలోచనా సులోచనం.
వాడి వేడి గల అక్షరాల పదునుతో
శిల్పంలా చెక్కి సత్యం, ప్రియంగా అందాలను
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి