విలువ తెలిసిన వాడు- .... కె.కె.తాయారు
అసలు ఓటు ఎందుకు
నా ఉనికి చాటునది
ఈ దేశ పౌరునిగా నిలుచు
ధైర్యం ఇచ్చు హక్కు నిచ్చునది!

ఇది నా  సర్వస్వం
ఇదే నా ఓటు హక్కు
నిలదొక్కుకుంటాను
దైర్య సాహసాలతో!!

ఇది ఒక వజ్రాయుధం
సద్వినియోగ పరచ
సక్రమమైన మార్గమున
మంచివారిని ఎంచుకొని

దేశభవిష్యత్తుకి పునాదులు
పటిష్టం చేసే మంచితనానికి
తలవగ్గి, ఆశల వలయాలలో
వ్యక్తిత్వాన్ని చంపక ఆదర్శంతో

 మనుగడకి ఉపయోగపడేట్టు
ఓటు ఉపయోగిస్తా ఓటు విలువ
చాలా చాలా ఎక్కువ, అన్యాయాన్ని
క్రూరత్వాన్ని , ధన దాహాన్ని

అంటగట్టి పెళ్ళగించి
అదః పాతాళానికి
అణగ దొక్కి రూపుమాపి
వెయ్యాలి పరిపూర్ణమైన

బంగరు బాట వెయ్యాలి
మన ప్రగతికి , నీతిగా
నిజాయితీతో ఆత్మ సాక్షిగా
అవలంబించాలి ప్రతి ఒక్కరు! !!

.

కామెంట్‌లు