అంగరంగ వైభవంగా జరుగుతున్న 56వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాలను పురస్కరించుకొని 19/11/2023 న నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లో గల శ్రీ పింగళి సూరన స్మారక శాఖా గ్రంధాలయం అధికారియైన శ్రీధర్ ఆధ్వర్యంలో దిశాచట్టం మరియు మహిళా సాధికారతపై చర్చ అనే అంశంపై నిర్వహించిన సాహితీవేత్తల కవి సమ్మేళనంలో నంద్యాల జిల్లాకు చెందిన ప్రముఖ కవయిత్రి మరియు జలవనరుల శాఖలోని తెలుగుగంగ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఇంజనీర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్. రత్నలక్ష్మిని అందమైన శాలువా సుందరమైన జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.
గ్రంథాలయ అధికారులు ప్రతి సంవత్సరం వారోత్సవాల మధ్య కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంగా సాహితీ రంగంలో అద్భుత ప్రతిభా పాటవాలు కనబరుస్తూ, తెలుగు సాహిత్యంలో అనన్య సేవలందిస్తున్న కవిశ్రేష్ట బిరుదాంకితయైన రత్నలక్ష్మిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మారుతున్న సమాజంలో మహిళా సాధికారత అనే శీర్షికన కవితను పఠించి జిల్లాలోని ప్రముఖ కవుల ప్రశంసలే గాక గ్రంథాలయ పాఠకుల ప్రశంసలను కూడా అందుకున్నారు.
ఈ సభకు సాహితీ స్రవంతి అధ్యక్షులు శ్రీనివాస మూర్తి, గౌరవ కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి, జిల్లాలోని ప్రముఖ కవులు రచయితలు సాహితీవేత్తలు గ్రంధాలయ అధికారి శ్రీధర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి