సీ:సంపదమ్మా పూజ శ్రద్ధతో జేసేరు
నందాల పీఠలో నమ్మ నుంచి
దీపాలు వెల్గించ దిగివచ్చు పద్మిని
దివినుండి భువిపైకి దీవెనియ్య
పూలహారాలేయ పులకించి పోయేను
పట్టు వస్త్రములోన పద్మినమ్మ
పచ్చని పందిర్లొ బాజాలు మ్రోగగ
వేదముల్ చదివేరు విప్రులంత
ఆవె:ఆరగింపు సేవ అమ్మకు జేసేరు
పంచ భక్ష్యములతొ భక్తితోడ
హారతిచ్చి వేడు నర్తితో యమ్మను
సకల సంపదిచ్చి సాదు మంటు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి