బాంధవ్యము;- డి.వినాయక్ రావు M.A, MEd భైంసా, జిల్లా నిర్మల్ ఫోన్: 9440749686
కం:గలగల పారే యేరులొ
మిలమిల మెరిసేడి నీరు మెదులుట నందం
మలమల మాడే కుక్షికి
జ్వలముగ నున్నట్టి దైన సాపాటందం

కం:చెట్టుకు నాకుల బంధము
గట్టిగ నుండంగ మ్రాను గ్రాసము నొందున్
పట్టది మనిషికి బంధము
బెట్టుగ మార్చంగ మనసు విజయము నొందున్


కామెంట్‌లు