కోటి జన్మల పుణ్యం !0కోరాడ నరసింహా రావు.
 అదృష్ట ముంటేనే.... 
  కార్తీక సంధ్యా దీప జ్వలనం !
    ఆ  దీప దర్శనం.... 
   జన్మ - జన్మ ల సకల  పాప హరణం  !!
కార్తీక దీప దర్శనం...పాపనాశనం !
 మోక్షదాయకం, నమోస్తుతే !!
మాసములలో... పవిత్రమైన కార్తీకంలో సంధ్యా దీపం... 
 కోటి దేవతల పరివేష్టితం !శివకేశవులిరువురి... 
 అతి పవిత్ర,ఏకాదశి,పౌర్ణమిల పవిత్ర మాసం... !
  ఆరాధనకు అత్యంత ప్రాశస్త్యం.. !!
ఈ దేహ ప్రమిదలో.... 
  జీవుడు వత్తియై.... 
     పూర్వకర్మలే... 
      చమురు  కాగా... 
   ఆత్మాగ్ని జ్వలితమైన దీపము వెలుగునందాక... 
   ఇది... శివమే.... !
  ఇది  కొండెక్కితే.... 
    ఈ కట్టె  పాడెనెక్కాల్సిందే!!
ఇదికదా... జ్యోతి మహత్తు !
 ఇది వెలుగునందాక.... 
  పరిసరముల ప్రకాశము నింపును ! వెలుగే జ్ఞానము... 
 జ్ఞానమే... ఆనందము... ఆ ఆనందమే... మోక్షము !
  ఈ దీప వైశిష్ట్యమును చాటుటయె.....,
  కార్తీక దీపారాధన !!
      ********

కామెంట్‌లు