సుప్రభాత కవిత ;0 బృంద
తూరుపు వాకిట
మెరుపుల కిరణాలు
తొలి సంధ్య వేళ
ఇలకు వెలుగుల తోరణాలు

గుండెలో విరిసిన
మధురభావనల
చెప్పకనే తెలుసుకున్న
కుసుమ సిరిబాల

కంటికింపైన ఉషోదయం
స్పందించు హృదయం
మురిపించు మనం
పలికించు కవనం

పూలదారుల పయనించు
పాదాల అతిశయం
తలపులోన కలిగె
మాటలకందని పరవశం

వెలుగులా జగమంతా
చెలిమితో  నిండిపోగా
హితమైన సౌరభంలా
శాంతి అలుముకోదా??

ప్రకృతి  ప్రవృత్తి మొత్తంద
పరోపకారమే పరమార్థమైతే
అందులో భాగమైన 
మనకెందుకు స్వార్థం?

పువ్వులా  ముచ్చటగా
గువ్వలా స్వేఛ్ఛగా
మువ్వలా మురిపెంగా
నవ్వులే  సంపదగా మసిలే

అపురూప వరమిచ్చి
ఆనందమనే ఐశ్వర్యం 
అనుక్షణం అనుగ్రహించే
అద్భుతమైన అరుణోదయానికి

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు