అడవి తల్లి- యం .సాయి కిరణ్ ,తరగతి : 8వ Als ,TTWURJC (B )KONDAPUR,నారాయణ్ పేట్

 అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు చాలా మంచి మనసు దయ కలిగి ఉంటుంది. ఆ చెట్టు ఒక రోజు ఇలా ఆలోచించింది. మానవులు చాలా ఆపదలో ఉన్నారు. రానురాను చెట్లు బాగా తగ్గుతున్నాయని,చెట్లను ఎక్కువ సంఖ్యలో చేసి మానవులను ఎలాగైన కాపాడుకోవాలనుకుంది చెట్టు. ఇంకా చెట్లను ఎక్కువ చెయ్యడం తన ఆశయంగా భావించింది. ఆ చెట్టుకి ఒక పెద్ద తొర్ర ఉండేది. ఒక రోజు కాకి, ఉడుత, కుందేలు చెట్టు దగ్గర వచ్చి మేము నీ తొర్రలో నివసిస్తాము అన్నారు. దానికి చెట్టు ఇలా ఉన్నది నేను మీకు ఒక పనిని అప్పజెప్తాను వాటిని సక్రమంగా నిర్వహించుకుంటామంటే మీరు ఇక్కడ ఉండవచ్చు అని చెట్టు ఉన్నది. రవి ఏమిటని ఆ మూడు అడిగాయి. అది నేను ఈఅడవిలో చెట్లను ఎక్కువ చెయ్యాలనుకుంటున్నాను. దానికి ఉడుత నువ్వు నా పండ్లను తిని వచ్చిన గింజలను అడవిలో నాటు ఇంకా కుందేలు నువ్వు ఈ చుట్టు పక్కల ఎక్కడైతే చెట్లు లేవో ఆ ప్రదేశాన్ని చూసి ఉడుతకు చెప్పాలి. కాకి నువ్వు మనం నాటిన గింజలు మొలుస్తున్నాయా లేదా నాకు చెప్పాలి అని చెట్టు వాటికి పనిని అప్పజెప్పింది. వారి దగ్గర మాట తీసుకుంది. దీనికి ఆ మూడు ఒప్పుకున్నాయి . ఇంకా వాటి పనులను చేయసాగాయి. కొన్ని రోజుల తరువాత కొంత మంది మనుషులు వచ్చి ఆ మామిడి చెట్టుని నరికేశారు. దానిని చూసి ఆ ముగ్గురు చాలా బాధపడి మామిడి చెట్టు ఆశయాన్ని ఎలాగైన నెరవేర్చాలని వారు అనుకున్నారు. దాని కోసం మామిడి చెట్టును నరికిన మనషులతోనే ఈ పని చేయించాలనుకున్నారు. అందుకు వారు ఒక పామును కలిశారు. వారు వారి సమస్యలను చెప్పి ఇంకా ఇలా అన్నారు. ఇక్కడికి రోజుఒక అటవి శాఖాధికారి వస్తాడు. ఆ అధికారిని నువ్వు కరవాలని పాముకు చెప్పారు. దానికి పాము ఆ పని చేస్తే నాకేమి అని అడిగింది. దానికి కాకి తన గుడ్లను త్యాగం చేసింది. ఇదే వారు ఒక వైద్యుని దగ్గరకు వెళ్ళారు. ఆ ఆయుర్వేదిక వైద్యుడు ఔషధాలు తయారు చేస్తాడు. వారు ఆయుర్వేదిక వైద్యునికి వారి సమస్యలు చెప్పారు. మీ దగ్గర ఒక అధికారి వస్తే ఇలా చెప్పమన్నారు దానికి ఆయుర్వేదిక వైద్యుడు ఒప్పుకున్నాడు. మరుసటి రోజు అటవి శాఖ అధికారి అడవిలోకి వచ్చాడు. అతడు చాలా మంచి మనిషి తనకు ఎవరైనా సహాయం చేస్తే వారికి తిరిగి సహాయం చేస్తాడు. అతడు అడవిలో వెళుతుండగా పాము అతనిని కరుస్తుంది. దానికి అధికారి ఆసుపత్రికి వెళ్ళాలనుకుంటాడు. కాని ఆసుపత్రి దూరంగా ఉండడంతో దానికి అధికారి ఆయుర్వేదిక వైద్యుని దగ్గరకు వెళ్ళి నా ప్రాణాలు కాపాడమంటాడు దానికి ఆయుర్వేదిక వైద్యుడుసరే అని చెప్పి తనకు ఒక ఔషధాన్ని తాగించాడు . ఆ అధికారి తన ప్రాణాలను దక్కించుకున్నాడు. అయితే అధికారి అయుర్వేదిక వైద్యుడితో ఇలా అన్నాడు. నా ప్రాణాలను కాపాడిన మీకు నేను ఏవిధంగా సహాయపడగలను. దానికి ఆయుర్వేదిక వైద్యుడు ఇలా అన్నాడు. నీ ప్రాణాలను కాపాడింది నేను కాదు ఆ ఔషధం. ఆ ఔషధం చెట్టునుండి చెయ్యబడింది. అందుకు నువ్వు ఏమైన చెయ్యాలనుకుంటే చెట్లను కాపాడమని ఆయుర్వేదిక వైద్యుడు అన్నాడు. దానికి ఆ అధికారి ఒప్పుకున్నాడు. దానితో అధికారి ఆయుర్వేదిక వైద్యుడికి ఇచ్చిన మాట ప్రకారంగా అడవిలో అనేక చెట్లను నాటాడు. ఇంకా ఎవ్వరిని చెట్లను నరకనియ్యకుండా చేసి, అడవిని కాపాడాడు. దానిని చూసిన ఉడుత, కాకి, కుందేలు, మామిడి చెట్టు యొక్క ఆశయం నెరవేరిందని సంతోషపడ్డారు. దానితో కొన్ని సంవత్సరాల తరువాత అడవి మొత్తం ఎన్నో రకాల చెట్లతో నిండిపోయింది.

కామెంట్‌లు