ఆధ్యాత్మిక కందపద్యాలు;- మమత ఐల-కరీంనగర్-9247593432
 కం.
చెప్పని మాటలు జనులకు
జెప్పుచు తిరిగేడి వింత చేష్టలు గనగన్ 
యెప్పుడు జెప్పెను కృష్ణుడు
చప్పిడిగా దోచునట్లు సంఘపు రీతుల్
కం.
తప్పుడు మాటలనెప్పుడు
జెప్పని కృష్ణుని పొగుడుచు చెప్పుట తగునే
చప్పిడి పలుకులనెప్పుడు
నప్పగ వినినట్లు జెప్ప న్యాయంబౌనే!

కామెంట్‌లు