హరివిల్లు రచనలు -కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 531
🦚🦚🦚🦚 
మురిసిపోయే ముఖాల
అలసిపోని తరంగాలు.....!
మెరిసిపోయే పయనల
ఎగిసిపడే తరంగాలు.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 532
🦚🦚🦚🦚
అపజయములు కలుగునని
అన్య ఆలోచనలేల.............!
జయాపజయముల మాటల 
అధిక ఆవేశములేల.............!!
🦚🦚🦚🦚
హరివిల్లు 533
🦚🦚🦚🦚
కోట్లాది కోట్ల ధనం
కొనిపెట్టదు పుణ్యం.....!
ముక్కోటి ఏకాదశి
మోక్ష దాయక పుణ్యం....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 534
🦚🦚🦚🦚
నల్లధనం పంచుమా 
తేట తెలుపు మనిషిలా.....!
అమృతం పంచుమా
చల్లదనపు శశిలా.............!!
🦚🦚🦚🦚
హరివిల్లు 535
🦚🦚🦚🦚
రాబోవు రోజులలో
జాడ లేని బీడు భూమి.....!
కంటి నీరు తెచ్చి పెట్టు
కాన రాని పంట భూమి......!!
               ( ఇంకా ఉన్నాయి )

కామెంట్‌లు