హరివిల్లు రచనలు -కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 536
🦚🦚🦚🦚 
భూ ఉపరి చెరుకు
కనపడి సిరి తెచ్చు పంట...!
భూగర్భపు అల్లం 
కనపడని కనకపు పంట.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 537
🦚🦚🦚🦚
చిటికెడు పసుపులా
సుగుణాన్విత నిధివే.....!
సరిపడు విపుల ధాతలా
దానగుణ శ్రేష్టుడివే........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 538
🦚🦚🦚🦚
తెలుగు భాష తోటలో
పూయు అక్షరాల విరులు..!
సువాసనల బాటలో
ఫలాలనిచ్చు వృక్షాలు.......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 539
🦚🦚🦚🦚
జనవరి పది ప్రపంచ 
హిందీ దినోత్సవం.......!
చదువరులకిది సులభమని
స్వాగతించు దినోత్సవం....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 540
🦚🦚🦚🦚
మనుగడలకై అవి చేయు
హెచ్చు స్వర అరుపులు.....!
మచ్చుకైనా కనబడక 
అంతరిస్తున్న పక్షులు..........!!
               ( ఇంకా ఉన్నాయి )

కామెంట్‌లు