హరివిల్లు రచనలు --కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 541
🦚🦚🦚🦚 
మంచి మాటల బోధనలు
వివేకానందుడి ఘనత.......!
పరమాద్భుత ఆధ్యాత్మిక
పథమున నడవాలి యువత...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 542
🦚🦚🦚🦚
ధనిక రైతు ఖాతాలకు
కనక వర్షపు సపర్యలు.....!
బీద రైతు ఖాతాలకు 
తలవొంపుల తాఖీదులు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 543
🦚🦚🦚🦚
సర్వం నాదను అపోహ
స్వరం సదా వీడండి........!
సదా సదాశయాలతో
సదాశివుడిని తలవండి.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 544
🦚🦚🦚🦚
పట్టణాలు సంక్రాంతికి
బోసిపోవును సదా.......!
పల్లెజనులకేమో పట్ట
పగ్గాలుండవు కదా.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 545
🦚🦚🦚🦚
శిశువుల అశువులు కనుమా
వాయువేగమున హనుమా.....!
పశువులకు పటుత్వ శక్తి 
నివ్వగ రావా హనుమా...........!!
               ( ఇంకా ఉన్నాయి )

కామెంట్‌లు