హరివిల్లు రచనలు -కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 551
🦚🦚🦚🦚 
ఇతరులు బాధించు ధనం
ఎంతున్నా నిరర్థకం...........!
ఇతరుల సంతోషాలకు 
కొంతున్నా సార్థకం.............!!
🦚🦚🦚🦚
హరివిల్లు 552
🦚🦚🦚🦚
దాన గుణమును పెంచు
సన్మార్గ ఆలోచనలు........!
మన వ్రతములు నోములు
దివ్య వారసత్వ నిధులు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 553
🦚🦚🦚🦚
గత జన్మ జ్ఞాపకాలు
జ్ఞప్తికి రావు మనకు......!
గత కర్మ ప్రారబ్ధాలు
భరించక తప్పదు తుదకు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 554
🦚🦚🦚🦚
మోదుగాకుల విరి చెట్టు
కాయల నివ్వవు సదా.....!
మోడు బారిన మనుషులకు
మోదములుండవు కదా.....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 555
🦚🦚🦚🦚
భీష్మ తర్పణ అష్టమి
ఉపదేశ మాఘాష్టమి......!
ఏకాదశి ఆగామి
నిర్యాణ దినం నమామి....!!
               ( ఇంకా ఉన్నాయి )

కామెంట్‌లు