పరమేశ్వర! పంచ పదాక్షరాభిషేకం!- డా.పి వి ఎల్ సుబ్బారావు. 94410 58797.
1. అర్ధనారీశ్వర తత్త్వం ,
                 విశ్వం సమస్తం !
    
    శివ, శివా ఐక్యమే ,
                 సమస్త చైతన్యం!
  
    విఘ్నాధిపత్యం,
             గణేశుడికే సొంతం!   
 
    దేవసేనాధిపత్యం ,
           కార్తికేయ సామర్థ్యం !
  
   శివ కుటుంబ స్మరణం,    
          భవతరణ సాధనం!

2.  అతడే జీవన గాన లయ,   
      చేయగలడు జీవలయం !
 
ఆ అనుగ్రహం మనం శివం, శవం అవడమూ అనుగ్రహమే! 

అది దయతో జనన మరణ, చక్రంలోంచి తప్పించడమే! 

నిజంగా అది తాపత్రయ, హరణం విముక్తి కారణం! 

మోక్షం అంటే ఇహ బంధ, విముక్తి ,పరమేశ్వర ఆసక్తి!

3. శివనామం పంచాక్షరి,    
       నమశ్శివాయ రక్షాకరి !

    శివ ఆరాధన సదా,
                   జీవన మంగళకరి!
 
    శివధ్యానం  ,
     నిత్యానిత్య వస్తు, బోధకరి !

    జీవన లక్ష్యం, చేరడం,   
                   శివసాలోక్య దరి !

   అంతిమంగా సామీప్యం,   
    సారూప్యం,సాయుజ్యం,
                                సిద్ధకరి!
4. నీలకంఠుడు జగాన ,
             పరమ పరోపకారి! 

   స్మశాననివాసి సదాధ్యాన,    
                వసంత విహారి!
 
   విభూతి ధారి,
   సమస్త విభూతికి రహదారి! 

   గంగా బంధనధారి,
  భగీరథ ప్రయత్న సఫలకారి! 

   శిరాన నెలవంక ,
 చల్లని చూపుల ఆనందకారి!

5. తనివి తీరా పిలు,పోయి,
    సాంబుడికి చెంబుడు నీళ్లు !

 బోలా శంకరుడు భళీ అంటూ,
           తప్పక దిగి వస్తాడు!
 
నీకు మరి రావు,
 జీవితాన ఏనాడు కన్నీళ్లు! 

ధరణి నేలకొరుగు,
 దుఃఖాల మర్రివృక్షాల వేళ్ళు !

మూడింట రెండు,  
      భక్తకన్నప్పకళ్ళ, ,
             కారుణ్యేశ్వరుడు,
        మన శ్రీకాళహస్తీశ్వరుడు!
_________
సదా పరమేశ్వరానుగ్రహ
            యాచకుడు.
_________

కామెంట్‌లు