ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 నాన్నగారు రామాయణాల గురించి అడిగిన మొదటి ప్రశ్నకే  అసలు వాల్మీకి మహర్షి రామాయణాలు ఎవరిని గురించి రాశారు  శ్రీరామచంద్రమూర్తిని గురించా లేక సీతమ్మ తల్లిని గురించా వారిద్దరి విషయాలు కాదు వారు చెప్పదలుచుకున్నది  వేద మూలానికి వెళ్లి  జటాయుతో ప్రారంభించిన కథ  త్రి జటతో  అంతం చేశారు  అంటే పక్షి కూత సామవేదంతో ప్రారంభం త్రి జట మూడు పాయలుగా తీయబడిన  వేదం  ఆ మూలానికి వెళ్లడానికి  గాయత్రి మంత్రమే  ప్రసాదం అని భావించిన వాల్మీకి మహర్షి  గాయత్రి మంత్రంలో ఉన్న 24 అక్షరాలతో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క  వెయ్యి శ్లోకాలు చొప్పున  రాసినదే రామాయణం  దీనికి మూలం  గాయత్రి మంత్రం అన్నది మనం మర్చిపోకూడదు.
విశాఖపట్నంలో చిన్న జీయర్ స్వామి గారు  రామాయణాన్ని 21 రోజులు చెబుతూ  శ్రీ భాష్యం వారిని వేదికపైనే కూర్చోబెట్టి  వారికి పాదాభివందనాలు చేసిన తర్వాతనే తన ప్రసంగం ప్రారంభించేవారు. నేను సి వి సూర్యనారాయణ 21 రోజులు  వెళ్లి విన్నాం  ఒకరోజు  కార్యక్రమం పూర్తయింది కార్ వచ్చింది  జియ్యర్ గారు కారు ఎక్కడం లేదు  దానికి కారణం శ్రీవారు ముందుగా కారులో కూర్చోవాలి  వారు కూర్చున్న తరువాతనే  చిన్న స్వామి కూర్చుంటారు  ఇది సంప్రదాయం  అలాంటి పెద్దవారికి  ఆదర్శప్రాయంగా నిలిచిన మహాయోగి పుంగవులు  నిజానికి మరో వాల్మీకి మహర్షి అని చెప్పదగిన  వ్యక్తి శ్రీ భాష్యం అప్పలాచార్యులవారు  వారితో  రామాయణాన్ని గురించి మాట్లాడడం  నాకు నాన్నగారికి పూర్వజన్మ సుకృతంగా భావించాం. నేను  తిరువణ్ణామలై వెళ్ళినప్పుడు  చలం గారిని కలిసి  వారి గురించి రికార్డు చేస్తానంటే  నా పాత చరిత్రను గురించి కానీ నా పుస్తకాలను గురించి గానీ  నేను మాట్లాడను  అవన్నీ ఎందుకు రాశాను అని  బాధపడుతున్నాను  ఆ తర్వాత వారి అమ్మాయి సౌరిస్ తో పాటలు పాడించి రికార్డు చేసి తీసుకొచ్చాం  ఆమె భీమిలి వచ్చిన తరువాత  నేను నాన్నగారు వెళ్లి  మీ జీవితం మీ మాటల్లో శీర్షికన రికార్డు చేయడానికి వచ్చామని చెబితే  అలాంటివి చేయడం నాకు ఇష్టం ఉండదు  నా గురించి నాకే తెలియనప్పుడు నా గురించి నేను ఏం చెప్తాను మీకు  అని రమణ మహర్షి గారి సిద్ధాంతాన్ని చెప్పింది  మీ గురించి కాదమ్మా నాన్నగారిని గురించి కాస్త వివరాలు అడుగుదామని మీ దగ్గరకు వచ్చాం అని నేను వినయంగా మాట్లాడితే సరేనన్నారు.


.

కామెంట్‌లు