ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.
 సత్య మూర్తికి అక్కడే పని చేస్తున్న  మరొక ఉపాధ్యాయునితో పరిచయమైంది  ఇద్దరూ సరదాగా కాలక్షేపం చేస్తూ  సమాజంలో మార్పు రావాలి దానికి మనం ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ  ఒకరోజు కొండపల్లి సీతారామయ్య గారు పీపుల్స్ వార్ గ్రూప్ అని పేరు పెట్టి  మనం నిస్వార్ధంగా పని చేద్దాం  అని ఇద్దరు  ఆ పనికి పూనుకున్నారు  అంత క్రితం  వీరిద్దరూ  వారి కులాల పేరుతో తిట్టుకోవడం  వల్ల  అసలు సమాజంలో కులాలు దేనికి  కుల నిర్మూలన చేస్తే ఎలా ఉంటుంది  అని ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చి  ఈ సంస్థను స్థాపించారు  ఆ తర్వాత నేను నాన్నగారు కలిసి  కొండపల్లి సీతారామయ్య గారితో ఆడియో రికార్డ్ చేయడం  సత్యమూర్తి తో కూడా  రికార్డు చేయడం జరిగింది. ఒకరోజు షణ్ముఖ ఆంజనేయరాజు గారు  నేను నాన్నగారు కలిసి  ఆయనతో  కొన్ని పద్యాలను పాడించుకున్నాం  ఆయనతో పరిచయ కార్యక్రమం చేస్తూ ఏవండీ మీరు పౌరాణిక చారిత్రక నాటకాలను చాలా బాగా ఆడతారు కదా  పెద్ద పెద్ద సమాసాలు చదువుతూ ఉంటారు ఆ సమాసాలకు అర్థం తెలుసునా అర్థం తెలియకుండా మీ ముఖంలో ఎలాంటి భావాలను పలికిస్తారు అని అడిగితే ఆయన పకపకానవ్వారు  మాకు హార్మోనియం మీద పద్యం పాడడం బాగా అలవాటు దాని శృతిలో  పూర్తిగా బట్టీ పట్టి అప్పచెప్పడం  తప్ప దానిలో అర్థ తత్పర్యాలు ఏవీ మాకు రావు  అని నిర్మోహమాటంగా చెప్పారు  మీరు అనుకున్నట్లు ఈ సాంఘిక నాటకాలలో ఉన్న మూమెంట్స్ మా పౌరాణికులకు ఉండవు
ఒక నాటకం వేయడానికి  ఒక్కొక్క పాత్రధారుడు ఒక్కొక్క గ్రామము నుంచి వస్తూ ఉంటారు.  మేము అందరం కలిసి సాధన చేసిన సందర్భాలు ఎక్కడా లేవు  ఎవరు ఎక్కడ నిలబడితే అక్కడ నుంచే వారు వారి పాట  లేదా పద్యం పాడడం  చాంతాడు లాంటి  వాక్యాలను వల్లించడం తప్ప  మాకు మరొకటి తెలియదు అని  నిర్మోహమాటంగా చెప్పారు  తాను ఈ నాటక రంగానికి ఎలా వచ్చింది? ఎవరు సహకరిస్తే ఈ స్టేజికి వచ్చింది మొత్తం వారిని గురించిన వివరాలను కూడా చెప్పారు  తరువాత నాన్నగారు కొన్ని ప్రశ్నలు అడిగి  సమాధానాలు రికార్డు చేసాం  అలా పౌరాణిక నాటకాలకు సాంఘిక నాటకాలకు ఉన్న భేదాలను ఆయన ద్వారా తెలుసుకున్నాం.


కామెంట్‌లు