ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి, విజయవాడ కేంద్రం,9492811322
 ఒకరోజు నాన్నగారు  సరదాగా మాటల సందర్భాల్లో  ఇవాళ ఏ గ్రామ చరిత్ర ఏమిటో మనకు తెలియకుండా ఉంది ఎవరికి వారు దానిని గురించి ఆలోచన చేయడం లేదు  పాత పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంది ఇక ముందు యువతరం ఎలా రాబోతుంది అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని  పుస్తకాలు రాస్తే చాలా మంచిది  అన్న అభిప్రాయాన్ని వెల్లడిస్తే  నేను  మా ఊరు తేలప్రోలు అనే పేరుతో మా గ్రామ చరిత్ర  వ్రాయమని పుల్లారెడ్డి అన్నయ్యతో చెప్పాను  వాడు 10 -12 రోజుల్లో  మొత్తం రాసి తీసుకొచ్చాడు  అది నాన్న గారికి చూయించి  మార్పులు చేర్పులు చేసిన తర్వాత  మా భాస్కర్ రావు తో  ఫైనల్ కాపీ తీసి  ముద్రించే ఏర్పాటు చేశాం. ఆ పుస్తక ఆవిష్కరణకు  నాన్నగారిని అధ్యక్షులుగా  నాతో పాటు చదివిన  ఇస్మాయిల్ ను  మా ఆత్మీయుడు బోస్  జడ్జి సత్య నారాయణ డా.శ్రీధర్ రెడ్డిని గారిని పిలిచి  ఏర్పాటు చేస్తే  దానిలో నాన్నగారు  ఇలాంటి  చరిత్రలు ప్రతి గ్రామానికి ఉండి తీరాలి  దీనివల్ల యువతరానికి ఎన్నో  కొత్త విషయాలు తెలుస్తాయి  మీ పల్లెటూర్లను ఎలా  ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లాలో తెలియడానికి బీజంగా పనికి వస్తుంది అన్న   అభిప్రాయాన్ని చెప్పిన తరువాత  ఇస్మాయిల్  బోసు జడ్జి గారు అందరూ మాట్లాడారు  ఈ పుస్తకాన్ని అందరికీ ఉచితంగా పంచిపెట్టి  మన గ్రామ చరిత్ర ఏమిటో  తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అన్న అభిప్రాయంతో అన్నయ్య ఆ పని చేశాడు. నేను నాన్నగారు ఒకరోజు  నడింపల్లి రామభద్ర రాజు గారి ఇంటికి వెళ్ళాము  వారి జీవన పద్ధతి  మాకు చాలా బాగా నచ్చింది  వారి ఇల్లు రాజ ఆస్థానము లాగా ఉంటుంది  అక్కడ పనిచేసే వారి దగ్గర నుంచి  మేనేజర్ వరకు  అందరికీ ఒకే రకమైన  గౌరవ మర్యాదలిస్తూ ఉంటారు రాజు గారు. వీడు తక్కువ కులం వాడు ఎక్కువ కులం అనే పదం అక్కడ నాకు కనిపించలేదు  దానధర్మాలకు పెట్టింది పేరు  వారికున్న ఆస్తిలో సగం  బీదలకు  వ్రాసి ఇచ్చిన  దయామయుడు  వారి మాటల్లో వారి జీవితాన్ని రికార్డు చేసి  దాదాపు మూడు గంటల  వ్యవధి తీసుకొని సమగ్రంగా  రికార్డు చేసి  వారి ఆతిథ్యాన్ని  స్వీకరించి తిరిగి వచ్చాం  వారి పద్ధతులు  నాన్నగారికి బాగా నచ్చి  వారిని రికార్డు చేయడానికి నన్ను ప్రోత్సహించారు.


కామెంట్‌లు