కళ్యాణగుణ సంపన్నుడు - నీలమేఘ శ్యాముడు! (అష్టాక్షరీ గీతి );- "కవిమిత్ర" శంకర ప్రియ., - సంచార వాణి:- 99127 67098
 నీలమేఘ శ్యామ! రామ!
      చల్లగ చూడుము మమ్ము!
      నల్లని స్వామివి నీవె!
      జయకృష్ణ! కృష్ణప్రియ!
               🪷(2)
      పతివ్రతా శిరోమణి
      ద్రౌపదీదేవి శీలము
      కాపాడిన దేవరవు!
      జయకృష్ణ! కృష్ణప్రియ!
             🪷(3)
      కళ్యాణ గుణములతో 
      సమస్త భక్తావళిని
      ఆకర్షించిన స్వామివి!
      జయకృష్ణ! కృష్ణప్రియ!
              🪷(4)
      సచ్చిదానంద మైనట్టి
      పరంబ్రహ్మ రూపుడవు!
      భూతాత్మ! భూత భావన!
      జయకృష్ణ! కృష్ణప్రియ!
   🚩కృష్ణం వందే జగద్గురుమ్!

కామెంట్‌లు