ప్రేమకు ప్రతిరూపము నాన్న;- -గద్వాల సోమన్న,9966414580
నాన్నలాంటి శూరుడు
కాంతులీను సూర్యుడు
ఎందెందు వెదికినా!
ఎక్కడైనా! ఉండునా!

ప్రేమ చూపు దేవుడు
చెలిమి పంచు మిత్రుడు
నాన్న కదా ఇంటిలో
చందురుడు మింటిలో

పరువు మోయు యోధుడు
కుటుంబాన నాథుడు
కన్న తండ్రి చూడగా!
అన్నింటిలో మిన్నగా!

బాధ్యత గల సైనికుడు
దక్షత గల పాలకుడు
నాన్నంటే కల్పతరువు
నడిపించే పరమ గురువు


కామెంట్‌లు